Begin typing your search above and press return to search.
పెరిగిపోతున్న టెన్షన్
By: Tupaki Desk | 15 Dec 2021 4:02 AM GMTతిరుపతిలో బహిరంగసభల నిర్వహణపై రెండువైపులా టెన్షన్ పెరిగిపోతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కంటిన్యు చేయాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ ఈనెల 17వ తేదీన బహిరంగసభ నిర్వహించాలని డిసైడ్ చేసింది. అయితే దీనికి పోలీసులు నిరాకరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంపై అమరావతి జేఏసీ నేతలు కోర్టులో కేసు వేశారు.
ఇదే సమయంలో అమరావతి జేఏసీతో విభేదిస్తున్న రాయలసీమ మేధావుల ఫోరం కూడా 17వ తేదీనే తిరుపతిలో బహిరంగసభ నిర్వహించాలని అనుకున్నది. వెంటనే పోలీసులను అనుమతి కోరింది.
అయితే అనవసరంగా ఉద్రిక్తతలు తలెత్తుతాయి కాబట్టి బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో మేధావుల ఫోరం కూడా కోర్టులో కేసు వేసింది. అంటే ఈనెల 17వ తేదీన బహిరంగసభ నిర్వహణ కోసమని ఇటు అమరావతి జేఏసీ అటు మేధావుల ఫోరం రెండు కూడా కోర్టులో పిటీషన్లు వేశాయి.
ఇపుడు ఈ అంశంపై కోర్టు ఏమి చెప్పబోతోందనే విషయంలో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. ఒకరికి బహిరంగసభకు అనుమతిచ్చి రెండోవారికి నిరాకరిస్తే అదో సమస్యవుతుంది. పోనీ ఇద్దరికీ అనుమతిస్తే అది శాంతి భద్రతల సమస్యగా మారినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే అమరావతి జేఏసీ తిరుపతి వీధుల్లో ర్యాలీలు నిర్వహించి, మూడు రాజధానులకు మద్దతుగా పెట్టిన ఫ్లెక్సీలను చింపేయటం ద్వారా అనవసరమైన ఉద్రిక్తతలకు అవకాశమిచ్చింది.
దాంతో రాయలసీమ ఉద్యమకారులు, యూనివర్సీటిలో విద్యార్ధి సంఘాలు అమరావతి జేఏసీ చర్యలపై మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో అమరావతి జేఏసీ బహిరంగసభకు అనుమతిస్తే కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం, ప్రత్యర్ధులను రెచ్చగొట్టినట్లవుతుంది. దాంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలనే డిమాండ్ వల్ల అమరావతి ప్రాంతంలో ఎలాంటి సమస్యలు రావు.
కానీ మూడు రాజధానులకు మద్దతున్న తిరుపతిలో అమరావతికి మద్దతుగా జేఏసీ ర్యాలీలు నిర్వహించటం ఎంతమాత్రం తగదు. కానీ అఖిలపార్టీ నేతల ఆధ్వర్యంలో అమరావతి జేఏసీ చేసిందిదే. దాంతో తిరుపతిలో అనవసరంగా ఉద్రిక్తతలను పెంచి పోషించినట్లయ్యింది.
మూడు రాజధానులకు మద్దతుగా పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగులను జనసేన, టీడీపీ విద్యార్ధి విభాగం నేతలు కూల్చేయటంతో సమస్య మొదలైంది. అమరావతి జేఏసీని తిరుపతిలో ఎవరు అడ్డుకోనపుడు మూడు రాజధానులకు మద్దతుగా పెట్టిన హోర్డింగులు, ఫ్లెక్సీలను చించేయాల్సిన అవసరం జనసేన, టీడీపీ నేతలకు ఏమొచ్చింది. ఏదేమైనా బహిరంగసభల కోసం వేసిన పిటీషన్లపై కోర్టు ఈరోజు విచారించే అవకాశముంది. మరి ఏమి చెబుతుందో ఏమో.