Begin typing your search above and press return to search.
గులాబీ బ్యాచ్ కు సోమవారం అసలు సిసలు అగ్నిపరీక్ష?
By: Tupaki Desk | 13 Aug 2021 7:42 AM GMTఅవును.. గులాబీ నేతలు.. కార్యకర్తలు ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారు. వారి ముందు వచ్చే సోమవారం వారికి చెమటలు పట్టిస్తోంది. ఏ మాత్రం తేడా వచ్చినా జరిగే డ్యామేజీని గుర్తు చేసుకొని కంగారు పడిపోతున్న పరిస్థితి. ఇంతకీ గులాబీ నేతలకు పట్టిన మండే టెన్షన్ ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల పంటగా చెప్పే తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని హుజూరాబాద్ లో షురూ చేయనున్నారు. త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం అనివార్యంగా మారటమే కాదు.. పార్టీ ఫ్యూచర్ కు ఇదో ల్యాండ్ మార్కుగా మారుతుందన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
దీంతో.. సోమవారం హుజూరాబాద్ లో నిర్వహిస్తున్న దళితబంధు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు ఉండాలని భావిస్తున్నారు. దీనికి కారణం గత వారం జరిగిన రెండు సభలేనని చెప్పాలి. ఆదివారం నల్గొండలో నిర్వహించిన రాజకీయ సంకల్ప సభను నిర్వహించారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరేందుకు వీలుగా చేపట్టిన ఈ సభ ఎంతలా సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాజీ ఐపీఎస్ అధికారి పిలుపు ఇంత భారీగా జనసమీకరణను తెలంగాణ అధికారపక్షం సైతం ఊహించలేదని చెబుతున్నారు.
సభ జరిగిన తీరు.. సభలో ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం మింగుడుపడని రీతిలో మారింది. ఇదిలా ఉంటే.. ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నిర్వహించిన దళిత గిరిజ దండోరా సభకు సైతం భారీగా హాజరు కావటం టీఆర్ఎస్ మీద మరింత ఒత్తిడిని పెంచిందని చెప్పాలి. ఈ రెండు సభల తర్వాత హుజూరాబాద్ లో సోమవారం సభను నిర్వహించనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో తెర మీదకు వచ్చిన దళిత బంధు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఆర్భాటంగా చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు ఉందన్న భావన కలిగేలా సభ ఏర్పాట్లు ఉండాలన్నది గులాబీ నేతల ఆలోచనగా చెబుతున్నారు.
టీఆర్ఎస్ కు ఈ సభ ఎంత ప్రతిష్టాత్మకమన్న విషయాన్ని గురువారం ప్రగతిభవన్ లో నిర్వహించిన రివ్యూ సమావేశం చెప్పకనే చెప్పేస్తుంది. ఈ సమావేశాన్ని ఉన్నతస్థాయిలో నిర్వహించారు.దీనికి ప్రభుత్వంలోని కీలక అధికారులంతా పాల్గొనటంతో పాటు.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పటం చూస్తే.. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు ఇస్తున్న ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు దళిత నేతల్ని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పుడు జరిగిన రెండు సభలకు ధీటుగా సోమవారం కార్యక్రమం ఉండాలన్న కేసీఆర్ లక్ష్యం ఎంతమేర నెరవేరుతుందన్నది సోమవారం కానీ తేలదని చెప్పక తప్పదు.