Begin typing your search above and press return to search.

రాజధానిలో టెంక్షన్ టెంక్షన్ .. భారీగా పోలిసుల మోహరింపు !

By:  Tupaki Desk   |   23 Dec 2019 10:42 AM GMT
రాజధానిలో టెంక్షన్ టెంక్షన్ .. భారీగా పోలిసుల మోహరింపు !
X
ఏపీకి మూడు రాజధానులు రాబోతున్నాయి అన్న ప్రకటన పై అమరావతిలో రైతుల ఆందోళనకు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. సోమవారం ఉదయం తుళ్లూరులో మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నా కోసం రైతులు వేసిన టెంట్లను పోలీసులు తొలగించేశారు. దీనితో కాసేపు అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. ఉదయాన్నే రోడ్లపైకి రైతులు వచ్చి , ధర్నాకి దిగుతుండటంతో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఆయా గ్రామాలకు వచ్చిపోయేవారిని ఆపి, వారి గుర్తింపు కార్డులను అడిగి, ఆధార్ కార్డుల్లో ఆడ్రస్‌ లను పరిశీలిస్తున్నారు. ఆధార్‌ కార్డులు అడగడం ఏంటని కార్డులతో రోడ్డుపైకి ఎలా వస్తామంటున్నారు. అలాగే పక్క పక్క గ్రామాలకు సరిహద్దుల్లా పికెటింగ్ పై ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే , ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే సచివాలయంకు వెళ్లే రోడ్డులో పోలీసులు నిఘాను పెంచారు. ఈ రూట్‌లో వెళ్లే వాహనదారుల్ని ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఐడెంటిటీ కార్డుల్ని పరిశీలించి పంపిస్తున్నారు. అలాగే అంటువైపుగా వెళ్లే ప్రతి వాహనం నంబర్‌ను నమోదు చేస్తున్నారు.

మరోవైపు నేడు రైతు దినోత్సవం సందర్భంగా... వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. రైతు నరసింహారావు.. రోజుకో గెటప్ తో నిరసన తెలుపుతున్నారు. అలాగే రాజధాని ప్రాంతంలోని మిగిలిన గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని , ప్రభుత్వం నుండి ఒక స్పేసతమైన ప్రకటన వచ్చే వరకు ఆపబోమని రైతులు చెబుతున్నారు.