Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ బైపోల్: బీజేపీ గెలుపు కాదు.. గెల్లు ఓటమి కాదట.?

By:  Tupaki Desk   |   2 Nov 2021 11:36 AM GMT
హుజూరాబాద్ బైపోల్: బీజేపీ గెలుపు కాదు.. గెల్లు ఓటమి కాదట.?
X
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ కొనసాగుతోంది. నరాలు తెగేలా ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈ ఉప ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లు 2,05,236 కాగా.. ఇప్పటివరకూ లెక్కించినవి 1,17,199 ఓట్లు. ఇంకా లెక్కించాల్సినవి 88037గా ఉన్నాయి.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హుజూరాబాద్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. 14 రౌండ్లు ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ రౌండ్ లో బీజేపీకి 1046 ఓట్ల ఆధిక్యం లభించింది. 14 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 9434 ఓట్ల మెజార్టీతో ముందుకు సాగుతున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామంలో టీఆర్ఎస్ వెనుకబడడం షాకింగ్ గా మారింది. ఆ గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ సాధించారు.

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం దిశగా సాగుతున్న ఈటల రాజేందర్ రౌండ్ రౌండ్ కు మెజార్టీని పెంచుకుంటున్నారు. అయితే హుజూరాబాద్ లో గెలిచేది ఈటల రాజేందర్ అని.. ఈ గెలుపును బీజేపీ ఖాతాలో వేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఈటలను ఆశీర్వదించారని చెప్పారు.

అటు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామమాత్రపు వ్యక్తి అని.. ఇది ఈటలకు కేసీఆర్ కు జరిగిన పోరుగా వారు భావిస్తున్నారు...