Begin typing your search above and press return to search.
రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపిన కరోనా
By: Tupaki Desk | 6 April 2020 3:27 AM GMTకరోనా వైరస్ కల్లోలం చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో కలవరం రేగుతోంది. రోజురోజుకు పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించగా పకడ్బందీగా కొనసాగుతోంది. అయితే కరోనా వ్యాపిస్తున్న క్రమంలో మనుషులు భయాందోళనలో తోటి వారిని అనుమానించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కరోనా లక్షణాలు ఉంటే వారిపై దాడులకు తెగ పడుతున్న సంఘటనలు ఉన్నాయి. ఇదే వరుసలో ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండడం.. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో గ్రామాల్లో కంచెలు ఏర్పాటుచేసుకున్నారు. గ్రామాల సరిహద్దులు మూసేసి గ్రామంలోకి ఎవరూ రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకున్నారు. కరోనాను నివారించేందుకు స్థానికులు ఒక గ్రామంలో కంచె ఏర్పాటుచేశారు. అయితే కంచె ఏర్పాటుతో రెండో గ్రామంలోకి వెళ్లేందుకు దారి లేదు. దీంతో కంచె తీసేయాలని ఆ గ్రామం వారు కోరగా కుదరదని చెప్పేశారు. దీంతో రెండు గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నివారణ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.
అయితే రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 29 కేసులు వెలుగులోకి రావడం తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఈ జిల్లాలో మొత్తం 32 పాజిటివ్ కేసులు రావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ క్రమంలోనే కంచె ఏర్పాటు చేయగా ఈ విధంగా గొడవకు దారి తీసింది.