Begin typing your search above and press return to search.

పదోతరగతి పేపర్ల లీక్ కేసులో అనూహ్యపరిణామం!

By:  Tupaki Desk   |   16 May 2022 4:32 AM GMT
పదోతరగతి పేపర్ల లీక్ కేసులో అనూహ్యపరిణామం!
X
ఏపీని కుదిపేసని పదో తరగతి పరీక్షా పేపర్ల లీకేజ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి నారాయణకు ఊరట దక్కింది. తాజాగా ఈ లీకేజీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కే . పునీత్ తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది.

ఈ క్రమంలోనే పిటీషనర్లపై బుధవారం వరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణను అదే రోజున వాయిదా వేశారు.

చిత్తూరు టాకీస్ వాట్సాప్ గ్రూపులో పదోతరగతి తెలుగు ప్రశ్నాపత్రంను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ చేయడంతో వివాదం రాజుకుంది. చిత్తూరు డీఈవో పురుషోత్తం ఏప్రిల్ 27న చిత్తూరు ఒకటో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే ఇందులో ప్రమేయం ఉందని మాజీ మంత్రి నారాయణను మే 10న చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా నారాయణకు బెయిల్ మంజూరైంది.

ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ కుమార్తెలు శరణి, సింధూర, అల్లుడు పునీత్ తోపాటు పలు విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటీషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. విచారణ చేపట్టిన కోర్టు అందరికీ ఈనెల 18 వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

పిటీషనర్లకు మాల్ ప్రాక్టీస్ వ్యవహారంతో సంబంధం లేదని.. పోలీసులు నమోదు చేసిన కేసులో వారిని నిందితులుగా పేర్కొనలేదని పిటీషనర్ల తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే నిందితులుగా పేర్కొననప్పుడు ఎందుకు బెయిల్ మంజూరు చేస్తున్నారని పోలీసులు వాదించారు. దీంతో ఈ నెల 18వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.