Begin typing your search above and press return to search.
ఆమె చనిపోయింది.. వందేళ్లకు బతుకుతుందట
By: Tupaki Desk | 19 Nov 2016 4:00 AM GMTవందేళ్ల కిందట ప్రాణాంతకంగా ఉన్న ఎన్నో జబ్బులకు తర్వాత తర్వాత మందులు కనుగొన్నారు. కోట్లాది మంది ప్రాణాల్ని కాపాడారు. ఇప్పుడు నయం కాని జబ్బులకు కూడా ఇంకో వందేళ్ల తర్వాత చికిత్స లభిస్తుందేమో. ఈ ఆశతోనే ఒక బ్రిటన్ అమ్మాయి తన మృతదేహాన్ని వందేళ్ల పాటు భద్రపరచడానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుంది.
ఇప్పుడా అమ్మాయి చనిపోయింది. కానీ ఆమె దేహాన్ని మాత్రం ఖననం చేయట్లేదు. ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా ఆమె దేహాన్ని అలాగే భద్రపరచనున్నారు. ప్రస్తుతం ఆమె మృతికి కారణం ప్రాణాంతకమైన ఒక క్యాన్సర్. ఈ వ్యాధికి వందేళ్ల తర్వాత కచ్చితంగా చికిత్స వస్తుందన్న నమ్మకంతో ఆమె తన దేహాన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య భద్రపరిచేందుకు కోర్టు నుంచి ముందే అనుమతి తీసుకుంది.
14 ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి తాను చనిపోతానని తెలిశాక చివరి కోరికగా తన మృతదేహాన్ని వందేళ్ల పాటు భద్రపరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు లేఖ రాసింది. ఆమె లేఖ చదివి చలించిపోయిన జడ్జీ ఆమె కోరిక ప్రకారం మృతదేహాన్ని ఫ్రీజ్ చేసి పెట్టేందుకు అనుమతి మంజూరు చేశాడు. ఐతే వందేళ్ల తర్వాత ఎలాంటి జబ్బుకైనా చికిత్స ఉండొచ్చేమో కానీ.. చనిపోయిన వారిని కూడా తిరిగి బతికించేంతగా వైద్య శాస్త్రం పురోగతి సాధిస్తుందా అన్నదే సందేహం. ఏమైనా ఈ అమ్మాయి కోరిక మాత్రం అసాధారణమైందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/