Begin typing your search above and press return to search.
ఐదుగురు ఉగ్రవాదుల్ని ఎన్‌కౌంటర్ చేసిన టీ పోలీసులు
By: Tupaki Desk | 7 April 2015 7:37 AM GMTగత కొద్దిరోజులుగా ఉగ్రవాదులకు.. తెలంగాణ పోలీసులకు మధ్య సాగుతున్న కాల్పుల వ్యవహారం తాజాగా మరో కోణంలోకి మారింది. సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి ఇద్దరు పోలీసుల ప్రాణాల్ని తీసిన సిమి ఉగ్రవాదులు తప్పించుకుపోవటం.. అనంతరం వారిని నల్గండ జిల్లా జానకీ పురం వద్ద పోలీసులు కాల్పులు జరిపి చంపేయటం తెలిసిందే. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ మరణించగా.. ఎస్‌ఐ సిద్ధయ్య చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. వరంగల్ జిల్లా జైలులో ఉన్న ఐదుగురు ఐఎస్‌ఐ ఉగ్రవాఉల్ని హైదరాబాద్ తరలించే క్రమంలో నల్గండ జిల్లా ఆలేరు.. జనగామ మధ్య జాతీయ రహదారిపై పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఐదుగురు ఉగ్రవాదులపై పోలీసులు కాల్పులు జరపటంతో వారు మృత్యువాత పడ్డారు.
మార్గమధ్యలో ఎస్కార్ట్ వాహనం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు.. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల తుపాకుల్ని లాక్కునే ప్రయత్నం చేయటంతో.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో.. వారంతా అక్కడికక్కడే మరణించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఉగ్రవాదుల కాల్పులు.. ఎన్‌కౌంటర్లు.. తాజా ఎన్‌కౌంటర్ మొత్తం నల్గండ జిల్లాలోనే జరగటం.