Begin typing your search above and press return to search.
భారత్ లో తొలిసారి తన ఉనికి చాటిన ఐసిస్
By: Tupaki Desk | 8 March 2017 8:37 AM GMTమానవత్వం అన్న మాటను వేల కిలో మీటర్ల దూరంలో పూడ్చేసి.. బతికేసే రాక్షసులు ఐసిస్ తీవ్రవాదులుగా చెప్పొచ్చు. మనుషుల్ని ఎంత దారుణంగా.. ఆరాచకంగా చంపొచ్చొ వారిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తాము కాలు పెట్టిన ప్రతిచోటా శాంతి అన్నది లేకుండా చేసే ఈ దుర్మార్గులు ఇప్పటివరకూ సిరియా.. ఇరాక్ లలో తమ ప్రతాపాన్ని చూపారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో రెండు చోట్లా చావుదెబ్బ తిన్న వారి చూపు ఇప్పుడు భారత్ మీద పడిందా? ఎంతోకాలంగా భారత్ లో తమ ఉనికిని చాటాలన్న వారి తొలి ప్రయత్నం నెరవేరిందా? అంటే అవుననే సమాధానం లభిస్తోంది.
తమ నీచ ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ ను డెన్ గా మార్చుకోవాలన్నట్లుగా అంచనాలు వినిపించినా.. అలాంటి అవకాశాల్లేవని కొట్టిపారేసే వారున్నా.. ఆ ధీమా తప్పే అవుతుందని చెప్పే ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఐసిస్ చెర నుంచి బయటపడిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైద్యులు డాక్టర్ కోసనం రామ్మూర్తి.. భారత్ ను ఐసిస్ టార్గెట్ చేస్తున్న విషయాన్ని చెప్పటాన్ని మర్చిపోలేం.
వారి చెరలో తాను ఉన్నప్పుడు.. వారి మాటల ప్రకారం.. భారత్ మీద వారి దృష్టి ఉందని.. భారత్ ను తమ అడ్డాగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసినట్లుగా ఆయన చెప్పటం మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే.. తాజాగా లక్నోలో చోటు చేసుకున్న ఘటనను చూస్తే.. ఐసిస్ భారత్ లో కాలు పెట్టినట్లుగా చెప్పక తప్పదన్న మాట వినిపిస్తోంది.
భోపాల్ – ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లా కలాపీపల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఐసిస్ హస్తం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని రీతిలో యూపీలోని లక్నోలో ఇద్దరు ఐసిస్ తీవ్రవాదులు నక్కి ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్.. వారిని ఏరేసే ప్రయత్నాల్ని షురూ చేసింది.
బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అవతలి వైపు నుంచి కాల్పులు ఆగిపోవటంతో.. లోపలకు వెళ్లిన అధికారులకు చనిపోయిన ఒక మృతదేహం కనిపించింది.అతడి దగ్గర రివాల్వర్.. కత్తి లాంటి ఆయుధాలు లభించాయి. ఇతడ్ని ఉగ్రవాది సైపుల్లాగా గుర్తించారు. ఇతడికి ఉజ్జయిని ప్యాసింజర్ ట్రైన్ పేలుడుతో సంబంధం ఉందని అంచనా వేస్తున్నారు.
అనంతరం జరిపిన సోదాల్లో ఐసిస్ జెండాతో పాటు.. మందుగుండు సామాగ్రి లభించటం గమనార్హం. యూపీ చివరి దశ ఎన్నికల పోలింగ్ జరగటానికి కొద్ది గంటల ముందు జరిగిన ఈ ఎన్ కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో.. ఐసిస్ భారత్ లో చేసిన తొలిదాడి అధికారుల్ని షాక్ కు గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఐసిస్ రాక్షసులు దేశం మీదకు వచ్చేసిన నేపథ్యంలో.. అందరూ తమ పరిసరాల విషయంలో అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/