Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ దాడులు చేస్తాం.. కాచుకోండి: బెంగుళూరు పోలీసుల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌

By:  Tupaki Desk   |   25 Nov 2022 3:31 AM GMT
మ‌ళ్లీ దాడులు చేస్తాం.. కాచుకోండి: బెంగుళూరు పోలీసుల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌
X
ఇది.. బెంగుళూరు పోలీసుల‌కే కాదు.. దేశ భ‌ద్ర‌త‌కు కూడా పెను ఉప‌ద్ర‌వాన్ని తెచ్చిపెట్టేహెచ్చ‌రిక‌. తాజాగా ఉగ్ర‌వాదులు.. `మ‌ళ్లీ దాడులు చేస్తాం.. కాచుకోండి` అంటూ తాజాగా బెంగుళూరు పోలీసుల‌కు ఉగ్ర‌వాదులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇటీవ‌ల‌..  మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమ పనేనని, మరో దాడికి సిద్ధంగా ఉండాలని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్ తాజాగా హెచ్చరించింది.

మంగళూరు పేలుడు కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని ఉగ్ర‌వాదులు  తమ సోదరుడని పేర్కొన్నారు. అంతేకాదు.. అస‌లు  తమ టార్గెట్ మంగళూరు నగరం కాద్రిలోని ఓ దేవాలయమని పేర్కొన‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

బీజేపీ ఉగ్రవాదులకు మంగళూరు కంచుకోటలా మారిందని ఆరోపించిన ఉగ్ర‌వాదులు.. తమ ఈ ప్రయత్నం విఫలమైనా ఇక్కడితో ఉరుకోబోమని, రాష్ట్ర, కేంద్ర బలగాల కన్నుగప్పి మరో దాడి చేస్తామని, అందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు.

కాద్రిలోని హిందూ ఆలయంపై తమ సోదరుడు జరిపిన దాడి విఫలమైందని, తమ సోదరులను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర, కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయని ఉగ్ర‌వాదులు తెలిపారు. భవిష్యత్తులో మరో దాడి తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.

అది అంత‌ర్జాతీయ కుట్ర‌?

మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు దాడిని అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు ఐఆర్‌సీ చేసిన ప్రకటనను నిర్ధారించుకునే పనిలో పడ్డాయి. ఈ నెల 19న ఓ ఆటోలో ఈ బాంబు పేలుడు జరిగింది. రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో ఈ కుక్కర్ బాంబును తయారు చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు తొలుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు నిర్వహించే చిల్డ్రన్స్ ఫెస్ట్‌లో బాంబును పేల్చాలని అనుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.