Begin typing your search above and press return to search.
అందాల ప్యారిస్ పై ఉగ్ర పంజా
By: Tupaki Desk | 21 April 2017 5:09 AM GMTఒకప్పుడు యూరోప్ అంటే ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేది. కానీ.. కొద్ది రోజులుగా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాదుల కన్ను యూరోప్ దేశాల మీద పడటమే కాదు.. అక్కడ తరచూ ఉగ్రపంజా విసురుతూ.. ఏ నిమిషాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు పెరిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఉగ్రదాడులతో యూరోపియన్లను ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. యూరోప్ లో ఉగ్రవాదులు తిష్ట వేసుకున్నారన్న సంకేతాల్ని ప్రపంచానికి పంపించటంలో ఉగ్రవాదులు విజయం సాధించారు.
తాజాగా ఫ్రాన్స్ రాజదాని.. ఫ్యాషన్లకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రదాడితో ఆ నగర ప్రజల విలవిలలాడిపోయారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాది ఒకడు తుపాకీతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. వీధుల్లో కాల్పులకు బరి తెగించాడు. యుద్ధలో వినియోగించే తుపాకీతో చెలరేగిపోయాడు. చాంప్స్ ఎలీసెస్ ప్రాంతంలో కాల్పులకు తెగబడిన అతడిపై భద్రతాదళాలు కాల్పులు జరిపారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందాడు.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన భద్రతాదళాలు దుండగుడిపై జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు. ఉగ్రవాద చర్యతో భాగస్వామ్యం ఉందని భావిస్తున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఉదంతంలో పలువురి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు తామే బాధ్యులమని.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్.. లేవాంట్ ఉగ్రవాద సంస్థలు ప్రకటించాయి. ఉగ్రకాల్పులు జరిపిన కొద్ది నిమిషాలకే ఈ సంస్థలు తమదే ఈ చర్యగా పేర్కొనటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ ప్యారిస్ అంతా హైఅలెర్ట్ ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికలు జరగటానికి కేవలం మూడు రోజుల ముందు ఈ కాల్పులు చోటు చేసుకోవటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/