Begin typing your search above and press return to search.

జాగ్రత్త ఆ పదాలు వాడితే అరెస్టయిపోతారు

By:  Tupaki Desk   |   23 Jan 2016 9:17 AM GMT
జాగ్రత్త ఆ పదాలు వాడితే అరెస్టయిపోతారు
X
ఉగ్రవాదుల రహస్య కార్యకలాపాలు... వారు అనుకున్న పని పూర్తి చేసేవరకు వేసే ఎత్తుగడలు వంటివన్నీ నిత్యం పోలీసులకు సవాలే. అయినప్పటికీ పోలీసులు - భద్రతాబలగాలు నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల కుట్రలను చాలావరకు ముందే అడ్డుకోగలుగుతున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా ఉగ్రవాదులను పట్టుకుంటున్న తరుణంలో ఉగ్రవాదుల కోడ్ భాషకు అర్థాలు తెలుసుకుని పోలీసులే షాకవుతున్నారు. ఇంత అందమైన పదాలతో విధ్వంసకర సంకేతాలిస్తున్నారా అని షాకవుతున్నారు.

మారణహోమాలకు పాల్పడే ఉగ్రవాదులు తమ సంభాషణల్లో వాడే కోడ్‌ లాంగ్వేజ్‌ ఎంతో అందంగా వినిపిస్తున్నా అందులోని గూఢార్థం మాత్ర అత్యంత ప్రమాదకరంగా ఉంటోంది. తాజాగా ఉగ్రవాదుల సంభాషణల్లోని రహస్య సంకేతాల్ని డీ కోడ్‌ చేస్తూ నిఘా వర్గాలు కొన్ని వివరాలు వెల్లడించాయి. పాక్‌ ఉగ్రవాద సంస్థ హుజీ నేత జాన్‌ అహ్మద్‌ కాశ్మీర్ లోని ఇంతియాజ్‌ అనే ఉగ్రవాదికి ఫోన్‌ చేసి మాట్లాడగా అందులోని సారాంశాన్ని డీకోడ్ చేసిన నిఘా వర్గాలు షాక్ తిన్నాయి. నిఘా వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఉగ్రవాదులు వినియోగించి కోడ్ లాంగ్వేజ్ లో బాంబులను అమెరికన్ అమ్మాయిలు అని అంటున్నారట. ఇక బడా మాల్ అన్నారంటే దానర్థం ఏకే 47 అని... చోటా మాల్ అంటే పిస్టల్ అని అర్థమట. బాంబులకు అమెరికా అమ్మాయిలని పేర్లు పెట్టి తమలోని సౌందర్యాభిలాషను చాటుకుంటున్నారు ఉగ్రవాదులు.