Begin typing your search above and press return to search.
`మోడీ కంటే తీవ్రవాది బెటర్`
By: Tupaki Desk | 6 Jan 2019 7:07 AM GMTసంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా తరచూ వార్తల్లో నిలిచే తెలుగునేత, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మరోమారు అదే తరహాలో మాట్లాడారు. ఈ దఫా ఏకంగా ప్రధానమంత్రి స్థాయిని కించపర్చేలా ఆయన వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కంటే తీవ్రవాదే బెటర్ అని నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన కంటే మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీం నయమంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ భిన్నంగా ప్రవర్తిస్తున్నాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ప్రధాని కపటనీతి ఏంటని నారాయణ నిలదీశారు. మహారాష్ట్రలోని శనిసింగాపూర్ ఆలయం విషయంలో కోర్టు తీర్పును బీజేపీ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. కేరళలో మాత్రం తీర్పును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
శని సింగాపూర్ లో కోర్టు తీర్పులను పాటించి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తే.. కేరళ అయ్యప్ప ఆలయం విషయంలో బీజేపీ, వీ హెచ్ పీ, ఆరెస్సెస్ లు అల్లర్లు సష్టిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఓ తీరుగా, ఇతర పార్టీల ముఖ్యమంత్రులు ఉన్న చోట భిన్నంగా ప్రవర్తించడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకు అన్ని వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక పార్టీలు ఏకం కావాలని ఆయన కోరారు.