Begin typing your search above and press return to search.
అచ్చం కశ్మీర్ ఫైల్స్ లో మాదిరి.. నిలబెట్టి పండిట్లను వేరు చేసి చంపేశారు
By: Tupaki Desk | 17 Aug 2022 5:21 AM GMTసంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కశ్మీర్ ఫైల్స్ మూవీలోని కొన్ని సీన్లపై చాలానే చర్చ జరిగింది. నిజంగానే వరుసగా నిలుచోబెట్టి.. చంపేసిన వైనంపై చాలానే వాదనలు చోటు చేసుకున్నాయి. సినిమాటిక్ గా చేశారన్న విమర్శలు ఉన్నాయి.
అయితే.. అందులో చూపించినవన్నీ వాస్తవాలుగా పేర్కొన్న వారు ఉండగా.. అతి హింసను చూపినట్లుగా కొందరువాదనలు వినిపించారు. తాజాగా కశ్మీర్ లో చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే.. కశ్మీర్ ఫైల్స్ మూవీలోని సన్నివేశాలు మళ్లీ గుర్తుకు రాక మానవు. జమ్ముకశ్మీర్ లో కాశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకొని హత్యలకు తెగపడ్డారు ఉగ్రవాదులు.
తాజాగా శోపియా జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన అక్కడి వారిని కలిచివేయటంతో పాటు.. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు ఆపిల్ తోటకు వచ్చారు. అక్కడ పని చేస్తున్న వారిని వరుసగా నిలుచోబెట్టారు. అనంతరం వారందరి నుంచి వివరాలు సేకరించారు. వారిలో ఇద్దరు కశ్మీర్ పండిట్లను గుర్తించారు. వారిని వరుస నుంచి వేరు చేశారు.
కశ్మీర్ పండిట్లు అయిన సునీల్ కుమార్ భట్.. అతని వరుసకు సోదరుడైన ప్రితంబర్ కుమార్ భట్ లను పక్కకు తీసుకెళ్లి.. ఏకే 47 గన్నులతో కాల్పులకు తెగబడ్డారు. తీవ్రవాదుల్లో ఒకరు కాలుస్తుంటే.. మరొకరు ఈ ఘోరాన్ని ఫోన్ లో షూట్ చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి తీవ్ర గాయాల బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించగా.. సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోగా.. ప్రితంబర్ పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు.
సునీల్ కుమార్ కు భార్య.. నలుగురు కుమార్తెలు ఉన్నారు. తాజా ఉదంతంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 21 మంది కశ్మీర్ పండిట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణాన్ని పెంచింది. సునీల్ కుమార్ అంత్యక్రియల సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో శ్మశాన వాటికకు ర్యాలీగా వెళ్లారు. హిందూ - ముస్లిం - సిక్కుల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తాజా దారుణం సంచలనంగా మారటమే కాదు.. కశ్మీర్ ఫైల్స్ కు ఏ మాత్రం తీసిపోయేదిగా లేదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.