Begin typing your search above and press return to search.

చార్లీ హెబ్డో ను వదిలేశారు కానీ..

By:  Tupaki Desk   |   14 Nov 2015 4:12 AM GMT
చార్లీ హెబ్డో ను వదిలేశారు కానీ..
X
మహ్మాద్ మత ప్రవక్తను అమానించారంటూ.. ఏడాది క్రితం ఫ్రాన్స్ లోని ‘‘చార్లీ హెబ్డో’’ పత్రికా కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడటం తెలిసిందే. ఈ సందర్భంగా కార్టూన్ వేసిన కార్టూనిస్ట్ తో పాటు.. పలువురిని హతమార్చిన ఘటన తెలిసిందే.

తాజాగా పారిస్ నగరంలో పలు చోట్ల ఉగ్రకార్యకలాపాలు చోటు చేసుకోవటం తెలిసిందే. గత ఏడాది వరకూ యూరప్ లో ఉగ్రకార్యకలాపాలు పెద్దగా ఉండేవి కావు. ఉగ్రవాద దాడులకు దూరంగా ఉన్నట్లుగా భావించే యూరప్ ఈ మధ్య కాలంలో తరచూ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో చోటు చేసుకున్న వివిధ ఉగ్రవాద కార్యకలాపాల్లో 200 మందికి పైగా మరణించారు.

అందుకు భిన్నంగా..తాజా ఉగ్రదాడిలో వివిధ ప్రాంతాల్లో ఒకేసారి 140 మందికి పైగా మరణించటం గమనార్హం. తాజా దాడి సందర్భంగా చార్లీ హెబ్డో మీడియా కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడటం గమనార్హం. చార్లీ హెబ్డో పత్రికా కార్యలయానికి కూతవేటు దూరంలో ఉన్న సెంట్రల్ ఫ్రాన్స్ లోని బటాక్లాన్ కాన్సెర్ట్ హాలుగా ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ జరిగిన దాడిలోనే.. అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. తాజా దాడిలో చార్లీ హెబ్డో పత్రికను ఉగ్రవాదులు పట్టించుకోకపోవటం గమనార్హం.