Begin typing your search above and press return to search.
ఈ ఔరంగజేబు మీ గుండెల్ని పిండేస్తాడు..
By: Tupaki Desk | 16 Jun 2018 5:17 AM GMTవీర జవాను ఔరంగజేబు గురించి విన్న వారంతా.. ఆయన గురించి తెలిసిన వారంతా విషాదంలో మునిగిపోతున్నారు. వీరబెబ్బులి అన్న మాటకు నిలువెత్తు రూపం లాంటి ఔరంజేబు మరణం ఇప్పుడు అందరిని కదిలించేస్తోంది. తాజాగా ఆయన్ను క్రూరంగా హతమార్చే వేళ తీసిన వీడియో వైరల్ గా మారటమే కాదు.. రక్తం మరిగిపోయేలా చేస్తోంది. ఔరంగజేబును చంపేసిన వారిని వెంటనే చంపేయాలంటూ రగిలిపోయేలా చేస్తోంది.
రంజాన్ పర్వదినాన్ని కుటుంబంలో కలిసి జరుపుకునేందుకు జమ్ముకశ్మీర్ కు చెందిన వీర జవాను ఔరంగజేబు ఇంటికి బయలుదేరారు. ఇక్కడ ఈ వీరబెబ్బులి గురించి కాస్త చెప్పాలి. లష్కర్ ఎ తొయిబా.. జైష్ ఎ మహ్మద్ కు చెందిన ఉగ్రవాద సంస్థలకు చెందిన టాప్ కమాండ్ మెంట్లను ధైర్యంగా హతమార్చిన ధీశాలి. ఇతడిపై కన్నేసిన ఉగ్రవాదులు.. ఇతన్ని కిడ్నాప్ చేశారు.
ఆయన్ను చంపేసే ముందు దారుణంగా హింసించారు. ఔరంగజేబు పాల్గొన్న పాత ఎన్ కౌంటర్ల గురించి ప్రశ్నించారు. ఉగ్రవాదుల బెదిరింపులకు బెదిరిపోకుండా ప్రాణాలు పోయే చివరిక్షణం వరకూ ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాల్ని చూస్తే గర్వంతో సెల్యూట్ చేయకుండా ఉండలేరు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ఆపరేషన్లలో తాను పాల్గొన్న విషయాన్ని ధైర్యంగా చెప్పటం వీడియోలో కనిపిస్తుంది.
అతను హింసించిన ఉగ్రవాదులు.. చివరకు బంధీగా ఉన్న అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. జైష్ ఎ మహ్మద్.. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఔరంగజేబును చంపే దారుణంలో ఇద్దరు విదేశీ ఉగ్రవాదుల పాత్ర ఉందని గుర్తించారు.
తన కొడుకును చంపిన ఉగ్రవాదుల్ని వెంటనే మట్టుబెట్టాలని ఔరంగజేబు తండ్రి కోరుతున్నారు. జమ్ముకశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల్ని ఏరి వేయాలని వారి కుటుంబం కోరుతోంది. ఈ విషయంలో ఔరంగజేబు కుటుంబమే కాదు.. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు.. వీరజవాను మృతికి బదులు తీర్చుకోవాల్సిందే అంటున్నారు.