Begin typing your search above and press return to search.

ట్విట్టర్ కొన్నాక టెస్లాపై నిర్లక్ష్యమా? మస్క్ ఏమన్నాడంటే?

By:  Tupaki Desk   |   20 May 2022 10:30 AM GMT
ట్విట్టర్ కొన్నాక టెస్లాపై నిర్లక్ష్యమా? మస్క్ ఏమన్నాడంటే?
X
ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ తన సొంత కంపెనీ టెస్లాపై దృష్టి సారించడం లేదన్న ఆందోళన అందరిలోనూ వినిపించింది. ముఖ్యంగా ఆ కంపెనీలో మదుపు చేసిన వారు దీనిపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు.తమ వద్ద టెస్లా షేర్లను విక్రయించడం ద్వారా తమ నిరసన తెలియజేశారు.

ట్విట్టర్ ను కొనుగోలుచేయడానికి టెస్లా షేర్లను ఎలన్ మస్క్ ఇటీవల అమ్మారు. దీంతో టెస్లా ప్రణాళికలు, లక్ష్యాలు దెబ్బతింటాయన్నది వారి ఆందోళన.ఈ పరిణామాల నేపథ్యలోనే టెస్లా షేర్లు ఇటీవల భారీగా పడిపోయాయి.

దీనిపై టెస్లా సీఈవోగా వ్యవహరిస్తున్న ఎలన్ మస్క్ తాజాగా స్పందించారు. టెస్లా 24/7 తన బుర్రలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారంపై తాను ఐదు శాతం కంటే తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు.

అదేమీ రాకెట్ సైన్స్ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం టెక్సాస్ లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో.. గురువారం స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగ కేంద్రం స్టార్ బేస్ లో తాను గడిపినట్లు ఎలన్ మస్క్ తెలిపారు.

చాలా మంది తనను ఎలా అపార్థం చేసుకుంటున్నారో చెప్పడానికి వీలుగా ఒక సరదా చిత్రాన్ని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. దీంతో టెస్లాను నిర్లక్ష్యం చేస్తున్నాన్న వాదనను కొట్టిపడేశారు.

టెస్లా ఈ సంవత్సరం టెక్సాస్ లో కొత్త కార్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. అంతేకాకుండా మస్క్ రాకెట్ కంపెనీ టెక్సాస్ లోని బోకా చికాలో స్టార్ బేస్ అనే ప్రయోగాత్మక సైట్ ను ఏర్పాటు చేసింది.