Begin typing your search above and press return to search.
మళ్లీ మొరాయిస్తోన్న టెస్లా కార్లు ..మస్క్ ఏం జరుగుతోంది !
By: Tupaki Desk | 21 Nov 2021 2:30 AM GMTఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ప్రపంచ రారాజుగా ఉన్న టెస్లాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సాంకేతిక సమస్యల కారణంగా టెస్లా కారు ఓనర్లు చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీనితో తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ కారు యజమానులు టెస్లా యజమాని ఎలన్ మస్క్ ని డిమాండ్ చేస్తున్నారు. టెస్లా కంపెనీ నుంచి మార్కెట్‌లో మోడల్ 3 వై, మోడల్ ఎస్, ఎస్ ప్లెయిడ్ కార్లు మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడయ్యాయి. యూరప్, అమెరికా మార్కెట్‌లో టెస్లా కార్ల అమ్మకాలు జోరుమీదున్నాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే ప్రయత్నంలో భాగంగా టెస్లా కార్లకు మొబైల్ యాప్ రూపంలో డిజిటల్ కీస్ ని అమర్చారు. సిలికాన్ వ్యాలీలో అవతరించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ఈ కార్లు అద్భుతమైన టెక్నాలజీతో పనిచేస్తుంటాయి. అలాగే ఈ కార్లలో ప్రయాణించడం చాలా సురక్షితమని వాహనదారులు భావిస్తుంటారు.
టెస్లా యాప్ ద్వారా కారును డోర్స్ ఓపెన్ చేయడం, కారును స్టార్ చేయడం తదితర కంట్రోల్స్ అన్నీ ఈ మొబైల్ యాప్ ద్వారానే కంట్రోల్ చేయోచ్చు. గత కొంత కాలంగా ఈ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. తరచుగా యాప్ మోరాయిస్తోంది. దీంతో యూజర్లు టెస్లా కారును వినియోగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కారు పక్కనే ఉండి గంటల తరబడి డోర్ ఓపెన్ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. మొదట ఈ సమస్య కెనడాలో ఎక్కువగా కనిపించగా ఆ తర్వాత అమెరికాలోనూ ఈ సమస్య వెలుగు చూసింది. ఇటీవల మొబైల్ యాప్ కి అప్ డేట్ ని టెస్లా రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ సమస్య ఉత్పన్నమైనట్టు యూజర్లు అంటున్నారు. మరోవైపు నెట్ వర్క్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ సమస్య వచ్చిందని త్వరలో పరిష్కరిస్తామని టెస్లా తరఫున ఎలన్‌మస్క్ బదులిచ్చారు.
ఇలాగే జులై లో ఒక టెస్లా డ్రైవర్ ఆటో ఫైలెట్ సిస్టమ్ లో ఒక భారీ సాంకేతిక సమస్యను గుర్తించారు. అదేంటంటే, ఈ ఆటో ఫైలెట్ సిస్టమ్ చంద్రుడిని చూసి ఎల్లో ట్రాఫిక్ లైట్ అని పొరపాటుగా అర్థం చేసుకుంది. అంతేకాదు, చంద్రుడి వెలుతురునుఎల్లో ట్రాఫిక్ లైట్ అనుకోని కారు వేగాన్ని బాగా తగ్గిస్తోంది. ఒక డిజిటల్ లైట్ కి, ఒక ఎలక్ట్రిక్ లైట్ కి మధ్య ఉన్న తారతమ్యం కూడా గమనించలేకపోతోంది. ప్రపంచంలోనే ది బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లుగా పేరొందిన టెస్లా కార్లు సైతం ఇలాంటి పొరపాటు చేస్తుండటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. అత్యంత విశ్వసనీయమైన కంపెనీగా భావిస్తున్న టెస్లా కనీసం టెస్ట్ కూడా చేయకుండా ఆటోపైలట్ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తేవడం విడ్డూరంగా ఉంది.