Begin typing your search above and press return to search.

అదే నిజమైతే నా కంపెనీ మూసేస్తా...! ఎలాన్​ మస్క్​..!

By:  Tupaki Desk   |   21 March 2021 7:30 AM GMT
అదే నిజమైతే నా కంపెనీ మూసేస్తా...! ఎలాన్​ మస్క్​..!
X
టెస్లా కార్లు గూఢచర్యానికి పాల్పడుతున్నాయంటూ ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఆరోపణలపై నేరుగా టెస్లా ఇంక్​ అధినేత ఎలాన్​ మస్క్​ స్పందించారు. తమ కంపెనీ ఎటువంటి గూఢచర్యానికి పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తమ కార్లు గూఢచర్యానికి పాల్పడ్డ మాట వాస్తవం అయితే .. తాను తన కార్లను మూసేస్తానని ఆయన సవాల్​ చేశారు.

చైనాలోని మిలిటరీ కేంద్రాల్లో టెస్లా కార్లు గూఢచర్యాలకు పాల్పడుతున్నాయంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎలాన్​ మస్క్​ మాట్లాడారు.‘మా కార్లు చైనాలోనే కాదు.. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా తమ కార్లు గూఢచర్యానికి పాల్పడుతున్నాయని ఆరోపణలు వస్తే .. మేము మా కార్ల సంస్థలను మూసేస్తాం’
ఇటీవల ఆయన చైనా సంస్థ నిర్వహించిన వర్చువల్ సెమినార్‌లో మాట్లాడారు.

టెస్లా కార్లు నిషేధం?

టెస్లా కార్యాకలాపాలను.. నిషేధిస్తున్నట్టు ఇటీవల చైనాలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఎలాన్​ మాస్క్​ మాట్లాడారు. టెస్లా కార్లలోని కెమెరాలను చైనాపై గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారనే ఆందోళనతో ఈ నోటీసులు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.


టెస్లా ఇంక్ సంస్థ తన కార్ల‌లో కెమెరాల‌ను ఇన్‌స్టాల్ చేసింద‌ని, దీంతో త‌మ భ‌ద్ర‌త‌కు ముప్పు ఉందనే కారణంతో ఆ సంస్థ కార్ల‌ను త‌మ కాంప్లెక్స్‌ ల్లోకి ప్ర‌వేశించ‌డానికి వీల్లేద‌ని చైనా మిలిట‌రీ నిషేధాజ్ఞ‌లు విధించిన‌ట్లు ప్రచారం సాగింది. అయితే టెస్లా కార్ల విషయంపై జరుగుతున్న దుష్ప్రచారానికి టెస్లా తెర లేపింది.