Begin typing your search above and press return to search.

టెస్లాకు లైన్​ క్లియర్​.. కానీ షరతులు వర్తిస్తాయి..!?

By:  Tupaki Desk   |   21 Jan 2022 12:30 PM GMT
టెస్లాకు లైన్​ క్లియర్​.. కానీ షరతులు వర్తిస్తాయి..!?
X
ప్రముఖ విద్యుత్​ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా.. మన దేశంలో అడుగు పెడుతుందా లేదా అనే దానిపై పరిశ్రమ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు టెస్లా యూనిట్​ ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ సంస్థ అధినేత ఎలన్​ మస్క్ కు వరస పెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు చేశాయి. మా దగ్గరికి వస్తే ఇంత రాయితీ ఇస్తాం అని ఒకరు అంటే.. మా దగ్గర ఇలాంటి వసతులు ఉన్నాయని మరొకరు చెప్పుకుంటూ వస్తున్నారు. పంజాబ్​ లాంటి చోట్ల అయితే టెస్లాకు రెడ్​ కార్పెట్​ పరుస్తామని నేతలు ప్రకటించారు. దీంతో ఈ సంస్థ యూనిట్. .​ భారత్​ లో నెలకొల్పేదానిపై ఊహాగానాలు తప్ప నిజం అనేది వినిపించడం లేదు. అయితే తాజాగా కేంద్రం.. టెస్లా ప్లాంట్​ పెట్టడానికి సుముఖంగా ఉన్న కానీ.. కొన్ని షరతులను విధించనుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

మన దేశంలోని చాలా రాష్ట్రాలు టెస్లా ప్లాంట్​ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ అధినేతకు ఇప్పటికే ట్వీట్​ చేశాయి. అయితే మస్క్​ ఇందుకు సిద్ధంగా లేరని తెలిస్తోంది. అయితే ఎలాగైనా ఆ ప్లాంట్​ ను భారత్​ లో పెట్టించాలని కేంద్రం వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ రాయితీల విషయంలో అసలు చిక్కు అంతా వచ్చి పడింది. ముఖ్యంగా ప్రస్తుతం ఒక టెస్లా కారు మన దేశంలో అడుగు పెట్టాలి అంటే కేంద్రం విధించే పన్ను 60 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటుంది. దీనిపై ఎలన్​ మస్క్​ సంతృప్తిగా లేరు. దీనికి ప్రధాన కారణం అమెరికాలో 34 లక్షల కంటే ఎక్కువగా ఉండే టెస్లా కారు ధర మన దేశంలో రెండింతలు అవుతోంది. దీనికి ప్రధాన కారణం దిగుమతి సుంకం ఎక్కువగా విధించడం. దీనినే మస్క్​ వ్యతిరేకిస్తున్నారు. రూ.29 లక్షలు ఉండే కారుపై మన దేశంలో 60 శాతం దిగుమతి సుంకం విధించడాన్ని మస్క్​ విభేధిస్తున్నారు. ఇందుకే ప్లాంట్​ ఏర్పాటు చేయాలంటే ఆలోచిస్తున్నారు.

దీనిపై మస్క్​ ఇటీవల ఓ ట్వీట్​ చేశారు. ముందుగా దిగుమతి సుంకం తగ్గిస్తే కార్లను విక్రయిస్తామని తెలిపారు. కానీ దీనికి కేంద్ర ఒప్పుకోలేదు. ప్లాంట్​ ఏర్పాటుకే పట్టుబడుతుంది. దీంతో మస్క్​ కూడా మరో రాగం అందుకున్నారు. టెస్లా కార్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్ధాలను ఎక్కువ సంఖ్యలో భారత్​ నుంచి తీసుకుంటామని తెలిపారు. తరువాత భారత్​ లో కార్ల విక్రయం చేపట్టి వాటికి వచ్చి రెస్పాన్స్​ ఆధారంగా ప్లాట్​ ఏర్పాటును పరిశీలిస్తామని అన్నారు. దీనికి కూడా కేంద్రం సరైన విధంగా స్పందించలేదు.

మస్క్​ కోరిన విధంగా దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే దేశీయంగా ఉండే ఆటోమెబైల్​ కంపెనీలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం తెలిపింది. కానీ ప్లాంట్​ ఏర్పాటు చేస్తే మాత్రం మేకిన్​ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేయాలని కేంద్ర పట్టుబడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు భారత్​లో పెట్టుబడులపై స్పష్టత ఇవ్వాలని కూడా కేంద్రం... మస్క్​ ను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

తెలంగాణాలో టెస్లా ప్లాంట్​ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్​ టెస్లా అధినేతను కోరారు. పంజాబ్​లో ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యక్షుడు సిద్దూ కూడా ట్వీట్​ చేశారు.