Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఫైటింగ్ స్పిరిట్ కు తొలి ప‌రీక్ష‌!

By:  Tupaki Desk   |   4 Jun 2019 8:20 AM GMT
జ‌గ‌న్ ఫైటింగ్ స్పిరిట్ కు తొలి ప‌రీక్ష‌!
X
స‌మ‌యానికి త‌గ్గ‌ట్లుగా మాట్లాడ‌టం.. అవ‌సరానికి త‌గ్గ‌ట్లుగా ఇష్యూల‌ను తెర మీద‌కు తీసుకురావ‌టం.. తాను చేసే డిమాండ్ల‌ను ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్చుకోవ‌టానికి సై అన‌టం లాంటివి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో అస్స‌లు క‌నిపించ‌వు. దీనికి నిద‌ర్శ‌నంగా ఏపీ ప్ర‌త్యేక హోదా మీద ఆయ‌న తొలి నుంచి ఒకే త‌ర‌హా వాద‌న‌ల్ని వినిపిస్తున్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌నిస‌రి అని తేల్చ‌ట‌మే కాదు.. హోదా సాధ‌న‌తోనే ఏపీ ప‌రిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయ‌ని వాదిస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన అనంత‌రం.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. ఢిల్లీలో ప్ర‌ధాని మోడీతో భేటీ సంద‌ర్భంలోనూ ఆయ‌న హోదా అంశాన్ని ప్ర‌స్తావించిన‌ట్లు చెప్పారు.

హోదా విష‌యంలో తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ త‌న తీరుతో ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అంతేనా.. ఢిల్లీలో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీయేకు అవ‌స‌ర‌మైన మేజిక్ ఫిగ‌ర్ రాద‌న్న ఆశ ఉండేద‌ని.. అలా జ‌ర‌గాల‌ని తాను కోరుకున్నాన‌ని.. కానీ దేవుడు త‌మ‌కు స‌హ‌కారం అందించ‌లేద‌ని చెప్ప‌టం ద్వారా.. హోదా సాధ‌న విష‌యంలో తాను ప‌ట్టుద‌ల‌తో ఉన్న విష‌యాన్ని చెప్పారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. త్వ‌ర‌లో జ‌రిగే లోక్ స‌భ స‌మావేశాల సంద‌ర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల స్టాండ్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. లోక్ స‌భ తొలి స‌మావేశాల్లోనే ఏపీ హోదా అంశాన్ని ఎంత బ‌లంగా తీసుకెళ‌తారన్న దానిపై చాలామంది ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పార్టీ ఎంపీలు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

హోదా విష‌యంలో తాము వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న విష‌యాన్ని త‌న‌ ఎంపీల తీరుతో జ‌గ‌న్ కేంద్రానికి సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌విధంగా చెప్పాలంటే జ‌గ‌న్ ఫైటింగ్ స్పిరిట్ కు తొలి ప‌రీక్ష‌గా లోక్ స‌భ స‌మావేశాలు మార‌నున్నాయ‌న‌టంలో సందేహం లేదు.