Begin typing your search above and press return to search.
ఆ కంపెనీలో ఉద్యోగికి బోనస్ 66.3లక్షల బోనస్
By: Tupaki Desk | 21 Dec 2015 9:13 AM GMTరూ.66,30,500. ఈ అంకెల్ని ఒక్కసారి చూపించి లెక్కించి చెప్పమంటే.. పది నుంచి ఇరవై సెకన్లకు పైనే సమయం పట్టే వీలుంది. లెక్కించటానికే ఇంత సమయం తీసుకునే మొత్తాన్ని.. బోనస్ గా కంపెనీలోని ప్రతిఒక్క ఉద్యోగికి ఇవ్వాలంటే.. కంపెనీ యజమానికి ఎంత పెద్ద మనసు ఉండాలి? తాను అనుకున్న లక్ష్యానికి చేరుకుంటే.. దాని వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని కంపెనీలోని ఉద్యోగులందరికి చెందేలా నిర్ణయం తీసుకోవటానికి చాలానే పే..ద్ద మనసు కావాలి. అలాంటి మనసు తమకు ఉందని ఇప్పటికే పలువురు నిరూపించారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు ప్రముఖ ఎనర్జీ ఉత్పత్తి సంస్థ హిల్ కార్ప్. చమురు ఉత్పత్తి చేసే ఈ సంస్థ.. తాము అనుకున్న దాని కంటే రెండింతల లక్ష్యాన్ని సాధించింది. దీంతో.. కంపెనీలోని ప్రతి ఉద్యోగికి రూ.66.3లక్షల మొత్తాన్ని క్రిసమస్ బోనస్ కింద అందజేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిజానికి ఇలాంటి సర్ ప్రైజ్ బహుమతులు ఇవ్వటం ఆ కంపెనీకి కొత్తేం కాదు. కానీ.. ఇంత భారీ స్థాయిలో బోనస్ ఇవ్వటాన్ని మాత్రం ఆ కంపెనీ ఉద్యోగులు ఊహించలేకపోతున్నారు.
దీనికి సమంజసమైన కారణం లేకపోలేదు. చమురు ధరలు దారుణంగా క్షీణించి.. ఆయిల్ మార్కెట్ దారుణ పరిస్థితుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో.. తమకిచ్చే బోనస్ లు ఎలా ఉంటాయన్న సందేహంలో ఉన్న ఉద్యోగుల ఆలోచలనకు భిన్నంగా.. .కంపెనీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం వెనుక.. ఆ కంపెనీ అధినేత హిల్డే బ్రాండ్ ఉన్నారు.
పోర్భ్ ప్రకటించిన ఆస్తుల లెక్క ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ.5.9బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజాగా ప్రకటించిన భారీ బోనస్ కంపెనీలో పని చేస్తున్న 1400 మంది ఉద్యోగులు ఇవ్వనున్నారు. ప్రపంచంలో కంపెనీలు కోట్లాదిగా ఉన్నా.. ఉద్యోగుల సంక్షేమం విషయంలో పే..ద్ద మనసు ప్రదర్శించేవి హిల్ కార్ప్ లాంటి సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయి సుమా.