Begin typing your search above and press return to search.
ఆ బిల్లు పాస్ అయితే ‘అమెరికన్ల’కు చుక్కలేనా?
By: Tupaki Desk | 28 March 2016 10:30 PM GMTరోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుకోవటం.. చాట్ చేసుకోవటం.. మెసేజ్ లు చెక్ చేసుకోవటం.. చిన్న చిన్న మేసేజ్ లను పంపుకోవటం మనం చూస్తేనే ఉంటాం. మనకు మాదిరే ఆగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఇలాంటి తీరే కనిపిస్తుంది. కాకుంటే.. ఇకపై అలాంటి పనులు చేసే అవకాశం మరెంతో కాలం ఉండకపోవచ్చు. రోడ్ల మీద నడిచే సమయంలో సెల్ ఫోన్లో మెసేజ్ లు పంపటమే కాదు.. చూడటం కూడా నేరమే అన్న చట్టాన్ని తయారు చేసేందుకు కసరత్తు మొదలైంది.
ఫోన్ మేసేజ్ లు పంపటం.. చూడటం కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయని.. పలువురు మృతి చెందుతున్నారంటూ ఇటీవల ఒక మీడియా సంస్థల లెక్కలు చెప్పుకొచ్చింది. దీని ప్రకారం.. ఇలా ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 2005లో ఉంటే.. 2014 నాటికి ఈ మృతుల సంఖ్య 15 శాతానికి పెరిగినట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో రోడ్ల మీద నడిచేటప్పుడు మేసేజ్ లు చదివినా.. టైప్ చేస్తున్నా నేరంగా పేర్కొంటూ తాజాగా న్యూజెర్సీ చట్టసభలో ఒక బిల్లును తీసుకొచ్చారు.
ఈ బిల్లు కానీ చట్టంగా మారిన పక్షంలో.. రోడ్ల మీద మెసేజ్ లు పంపినా.. చూసినా నేరంగా భావించటమే కాదు.. వారికి 50 డాలర్ల జరిమానా.. 15 రోజుల జైలుశిక్ష విధించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ చట్టం అమలైన పక్షంలో అమెరికన్లకు చుక్కలు కనిపించటం ఖాయమంటున్నారు. కాస్త అసౌకర్యమనిపించినా.. ప్రాణాలు తీసే ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.