Begin typing your search above and press return to search.
ముందే కూస్తున్న టిజీ కోయిల
By: Tupaki Desk | 24 Feb 2019 12:09 PM GMTఆలూ లేదు.... చూలూ లేదు అభ్యర్ది పేరు మాత్రం టిజీ భరత్. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు మూడు నెలలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్దులను ప్రకటించే ప్రక్రియకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్నద్దం అవుతున్నారు. ప్రతీ జిల్లాలోను సీనియర్ నాయకులను ఆ జిల్లాకు చెందిన శాసనసభ్యులను తన వద్దకు పిలిపించుకుని సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు అభ్యర్దుల ఖరారును మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే కర్ణూలుకు చెందిన యువనేత, టిజీ వెంకటేష్ కుమారుడు టిజీ. భరత్ మాత్రం తానే అభ్యర్దినంటూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేసారు.
కర్నూలు నగరంలోని అమీర్ హైదార్ ఖాన్ నగర్ నుంచి విజన్ యాత్ర పేరిట ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కర్ణూలు నగరానికి సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నానని భరత్ చెబుతున్నారు. నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులను విజయి యాత్ర పేరుతో ప్రత్యక్షంగా చూస్తున్నాను అంటున్నారు. నగరాన్ని ఎలాంటి సమస్యలు లేని నగరంగా తీర్చి దిద్దుతానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
ఎన్నికలు ఇంకా రాకముందే అభ్యర్దుల ప్రకటన జరగక ముందే టిజీ భరత్ చేస్తున్న ప్రచారం తెలుగుదేశం శ్రేణుల్లో ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కర్ణూలు నుంచి పోటీ చేసేందుకు టిజీ భరత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన తండ్రి టిడిపీ సినీయర్ నేత టిజీ. వెంకటేష్ ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలసి తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని విన్నవించుకున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా తనకు టికెట్టు ఇవ్వాలంటూ చంద్రబాబును కలసి కోరుకున్నారు. కర్ణూలు వివాదం ఓ కొలిక్కి రాకముందే టిజీ వెంకటేష్ కుమారుడు టిజీ భరత్ మాత్రం తన ప్రచారాన్ని రోజురోజుకు వుధ్రుతం చేస్తున్నారు.