Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కంటే అమరావతే బెటర్..మ్యాటరేంటంటే!

By:  Tupaki Desk   |   10 Feb 2020 12:00 PM GMT
హైదరాబాద్ కంటే అమరావతే బెటర్..మ్యాటరేంటంటే!
X
ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతిని ఒక రాజధానిగా ఉంచుతూనే అధికార వికేంద్రీకరణ పేరుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ గా విశాఖపట్నం - జ్యుడీషరీ క్యాపిటల్‌ గా కర్నూలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకువచ్చింది. కానీ, మండలిలో ఈ బిల్లుకి టీడీపీ మోకాలు అడ్డటంతో మూడు రాజధానుల వ్యవహారం మూడు నెలల పాటు పోస్ట్ పోన్ అయ్యింది. అయితే - టీడీపీ కావాలనే ఈ బిల్లుకి మద్దతు తెలుపలేదు - అభివృద్ధి వికేంద్రీకరణ మరో మూడు నెలలు ఆలస్యం అవచ్చు కానీ ,మూడు రాజధానుల ఏర్పాటు లాంఛనమే అని వైసీపీ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత - రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో మూడు రాజధానుల నిర్ణయం పై మరోసారి స్పందించారు. అయన మాట్లాడుతూ ... దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ కంటే అమరావతి బెటర్ అని - అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే బాగుంటుందని చెప్పారు. బీజేపీ పార్టీ కూడా ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణకే మద్దతు ఇస్తున్నట్టు తనకు అనిపిస్తోందని టీజీ చెప్పారు. కేంద్రం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడానికి ఒప్పుకుందని రాజధాని విభజనకు కూడా కేంద్రం పరోక్షంగా అంగీకరించినట్లే అని టీజీ వెంకటేష్ అన్నారు. అమరావతి రాజధానిగా పనికిరాదని సీఎం జగన్ ప్రకటన ఇచ్చారని ఆ ప్రకటన వలన అమరావతి ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలే చంద్రబాబుకు మాట్లాడే అవకాశాన్ని కల్పించాయన్నారు.

కర్నూల్ లో హైకోర్టు మాత్రమే ఏర్పాటు చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తిలేదని - శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఇస్తామని చెబుతున్న జగన్‌ 1953-56 మధ్యలో కర్నూలు రాజధానిగా ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారని , రాష్ట్రం విడిపోయాక 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని - ప్రభుత్వ విభాగాలను 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు చెప్పినా పట్టించుకోలేదని - మాట్లాడవద్దని వార్నింగ్‌ ఇవ్వడంతో ఎవరూ నోరు మెదపలేదు అని, బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటన ఇస్తే తాను సపోర్టు చేశానని, అప్పుడు కూడా వార్నింగ్‌ ఇచ్చారని తెలిపారు. ఏపీ బీజేపీలో జగన్‌కు వ్యతిరేకం - అనుకూలం అంటూ వర్గాలేమీ లేవన్నారు. అలాగే, జగన్ పారిశ్రామిక వర్గాలతో వ్యవహరించే తీరును అలవరచుకోవాల్సిన అవసరం ఉందని, మూడు ప్రాంతాల్లో అన్ని విభాగాలు ఏర్పాటు చేస్తూ, అమరావతిని దేశ రెండో రాజధాని చేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తే బాగుంటుందని సీఎం జగన్ కి టీజీ సూచనలు చేశారు.