Begin typing your search above and press return to search.
టీజీ... ఏం కామెంట్లివి?
By: Tupaki Desk | 1 Sep 2015 4:16 PM GMTమాజీ మంత్రి, టీడీపీ నాయకుడు టీజీ వెంకటేష్. రాష్ర్ట విభజన సమయంలో తన ఆసక్తికర స్టేట్ మెంట్ లతో వార్తల్లో వ్యక్తిగా ఉండేవారు. రాయలసీమను ప్రత్యేక రాష్ర్టం చేయాలని, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లోనే కలిపివేస్తే సీమలోనే రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టం విడిపోయి ఏపీగా ఏర్పడిన తర్వాత.... సీమలోనే రాజధాని కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఒకింత తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఇబ్బంది కలిగించే స్టేట్ మెంట్ లు ఇచ్చారు. తాజాగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కామెంట్లు చేశారు.
పని చేయని మంత్రులు, ఐఏఎస్ అధికారుల కన్నా అవినీతికి పాల్పడే అధికారులే ఉత్తములంటూ టీజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారులు అవినీతికి పాల్పడినా ఎంతో కొంత పని చేస్తారని, తద్వారా కొంతయినా అభివృద్ధి జరుగుతుందన్నారు. కర్నూలు లోని ఓ ప్రైవేట్ స్కూలు విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఏ విధంగా పని చేస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందంటూ కొందరు విద్యార్థుల అభిప్రాయాలు అడిగినప్పుడు దేశాభివృద్ధికి అవినీతి అడ్డు అని చెప్పిన తరువాత కేఈ ఈ విధంగా మాట్లాడారు. అధికారపార్టీలో ఉన్న నాయకుడు, గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉన్న కేఈ ఈ విధంగా మాట్లాడటం ఏమిటని అక్కడున్న నాయకులు చర్చించుకోవడం కనిపించింది.