Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఇప్పుడు సమైక్యాంధ్రా అంటే ఒప్పుకుంటాడు: ఎంపీ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 6 July 2021 3:39 PM GMTఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల కోసం సాగుతున్న ఫైట్ ముదిరిపాకాన పడుతోంది. ముందుగా కేసీఆర్ మొదలు పెట్టిన ఈ యుద్ధంలోకి తెలంగాణ మంత్రులు హాట్ కామెంట్స్ తో కాకరేపారు. దానికి ఏపీ మంత్రులు, జగన్ సైతం నిప్పులు చెరిగారు. జగన్ ప్రధాని మోడీకి దీనిపై లేఖలు రాయడంతో రాజకీయం వేడెక్కింది. అయినా కూడా తెలంగాణ వెనక్కితగ్గకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల నుంచి నీటిని వృథాగా వాడేస్తోందని ఏపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పరస్పర ఫిర్యాదులు, మాటలతో ఈ వైరం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో టీడీపీ మాజీ నేత, ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రాయలసీమ నేత టీజీ వెంకటేశ్ తాజాగా సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'సీఎం కేసీఆర్ కు కరోనా కారణంగా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆ కారణంగానే నీటి పంపకాల ఒప్పందాలు కేసీఆర్ మర్చిపోతున్నారు ' అని టీజీ వెంకటేశ్ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పంపకాలు కాదంటే ఎలా అని టీజీ ప్రశ్నించారు.
శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్ట్ అయితే సాగునీరు, తాగునీటి వనరుగా ఎలా వాడుకున్నారని టీజీ నిలదీశారు. నిజాం వచ్చి ఒప్పందం రద్దు అంటే కేసీఆర్ ఒప్పుకుంటారా? అని టీజీ వెంకటేశ్ ప్రశ్నించారు.
కేసీఆర్ అపర మేధావి అని.. కొత్త వచ్చిన తెలంగాణ రాష్ట్రం రద్దు చేసి సమైఖ్యాంద్ర అంటే ఆయన ఇప్పుడు ఒప్పుకుంటారని టీజీ వెంకటేశ్ సెటైర్లు వేశారు. నిజాం పాలనపై పోలీస్ యాక్షన్ ఎలా ఉండేదో శ్రీశైలం డ్యామ్ పై పోలీసు యాక్షన్ తీసుకొని శ్రీశైలం డ్యామ్ ను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. జలవివాదం సివిల్ వార్ కు దారితీసే ప్రమాదం ఉందన్నారు టీజీ.
కేసీఆర్ కు సీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదని టీజీ అన్నారు. ఏపీ ఓట్లు తెలంగాణలో ఉన్నాయి తప్పితే తెలంగాణ ఓట్లు ఏపీలో లేవని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఎన్నికలు వస్తే ఆంధ్ర పాట.. కరీంనగర్ లో ఎన్నికలు వస్తే తెలంగాణ పాట పాడటం కేసీఆర్ కు ఆనవాయితీ అని టీజీ దుమ్ముదులిపేశారు.