Begin typing your search above and press return to search.
టీజీకి కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా?
By: Tupaki Desk | 31 May 2016 7:30 AM GMTత్వరలో రాజ్యసభ సభ్యుడు కానున్న టీజీ వెంకటేశ్ కు కోపం వచ్చేసింది. మీడియాతో ఫ్రెండ్లీగా ఉంటూ వీలైనంత వరకూ వివాదాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండే ఆయనకు ఒక మహిళా జర్నలిస్ట్ మీద కోపం వచ్చేసింది. అయితే.. తనకున్న అనుభవంతో తనకొచ్చిన కోపాన్ని అణుచుకొని.. ముఖం మీద నవ్వు చెదరకుండా చెప్పాల్సిన విధంగా సమాధానం చెప్పేసి తన దారిన తాను వెళ్లటం గమనార్హం.
ఏపీ రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ సిద్ధమవుతున్న ఆయన్ను ఓ టీవీ జర్నలిస్ట్ ప్రశ్నలు వేశారు. మొదట్లో ప్రశ్నలన్నీ మామూలుగానే సాగినప్పటికీ ఉన్నట్లుండి సదరు జర్నలిస్ట్ టీజీని ఇరుకున పెట్టే ప్రశ్నను సంధించారు. రాజ్యసభ ఎన్నికల బరిలో అప్పటివరకూ లేని టీజీ వెంకటేశ్..బెర్త్ సాధించటాన్ని ప్రస్తావిస్తూ.. మంచిగా లాబీ చేసి అనుకున్నది సాధించారా? అన్నట్లుగా ప్రశ్నను సంధించారు.
ఎలాంటి మాటను వినకూడదని అనుకుంటారో.. అలాంటి మాటే సదరు జర్నలిస్ట్ నోటి నుంచి రావటంతో టీజీ స్వరంలో తేడా వచ్చేసింది. అయితే.. ముఖం మీద నవ్వు మాత్రం చెదిరిపోకుండా ఉంచుతూ..చిన్నపిల్లల్లా ప్రశ్నించొద్దు అంటూ చురకేసినట్లుగా ఒక వ్యాఖ్య చేసి.. ఇంటర్వ్యూ అయిపోయినట్లుగా తన దారిన తాను వెళ్లిపోయారు. రాజకీయాల్లో డక్కామొక్కిలు తిని పైకి వచ్చిన టీజీకి.. ఎలాంటి ప్రశ్నకు ఎలా సమాధానం బాగానే తెలుసన్న విషయాన్ని మరోసారి రుజువు చేశారని చెప్పాలి.