Begin typing your search above and press return to search.

ఎస్వీ పగ: టీజీ ప్లాన్‌ ఫెయిలేనా?

By:  Tupaki Desk   |   10 April 2019 9:09 AM GMT
ఎస్వీ పగ: టీజీ ప్లాన్‌ ఫెయిలేనా?
X
కర్నూలు జిల్లాలో రాజకీయం ఉద్దండుల మధ్యే జరగుతోందని చెప్పాలి. రాజకీయంగా ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్న టీజీ వెంకటేశ్‌ ఈసారి కర్నూలు బరిలో తన కుమారుడు టీజీ భరత్‌ ను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి హఫీజ్‌ ఖాన్‌ బరిలో ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన టీజీ వెంకటేశ్‌ స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌ రెడ్డి విజయం సాధించారు. అయితే కొన్నాళ్ల తరువాత ఆయన వైసీపీని వీడీ టీడీపీలో చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడంతో ఎస్వీ మోహన్‌ రెడ్డి కర్నూలు టికెట్‌ కోసం తీవ్రంగా కృషి చేశారు.

కానీ టీజీ వెంకటేశ్‌ తన పలుకుబడితో చంద్రబాబును ఒప్పించి తన కుమారుడు టీజీ భరత్‌ కు ఇప్పించగలిగారు. దీంతో మనస్థాపం చెందిన ఎస్వీ మోహన్‌ రెడ్డి తిరిగి వైసీపీలోకి చేరారు. అయితే ఆ పార్టీ అప్పటికే హఫీజ్‌ ఖాన్‌ కు టికెట్‌ ఖరారు చేసింది. తనకు టికెట్‌ దక్కకున్నా టీజీ భరత్‌ ను ఓడించాలనే ఉద్దేశంతో హఫీజ్‌ ఖాన్‌ కు మద్దతుగా ఎస్వీ మోహన్‌ రెడ్డి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. తాను అభ్యర్థిగా భావిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు.

టీజీ వెంకటేశ్‌ ఆర్థికంగా బలమున్న నేత. అటు హఫీజ్‌ ఖాన్‌ సైతం అదే స్థాయిలో అండదండలున్నాయి. ఇక నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ప్రభావితం చేస్తాయన్న భావనతో వైసీపీ నేత జగన్‌ హఫీజ్‌ ఖాన్‌ ను బరిలోకి దించారు.. ముస్లిం ఓట్లు కంప్లీట్‌ గా హఫీజ్‌ ఖాన్‌ కు వేస్తే ఆయన గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ టీజీ భరత్‌ కూడా ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రణాళికలు చేపడుతున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య గట్టి పోటీ సాగనుంది. అయితే గడిచిన సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీ మోహన్ తన బలం, బలగం అంతా వైసీపీ అభ్యర్థిని గెలిపించడానికి వాడడంతో టీజీ వెంకటేశ్ కుమారుడు గెలవడం అంత ఈజీ కాదంటున్నారు.

1994, 2004 ఎన్నికల్లో ఇక్కడ సీపీఎం సీటు సాధించింది. దీంతో జనసేన వామపక్షాల పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్థిని బరిలో దించింది. దీంతో ఆయన కాపు ఓట్లను, కమ్యూనిస్టుల ఓట్లను రాబట్టుకునేలా ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధానంగా మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యే పోరు సాగుతోంది.