Begin typing your search above and press return to search.
వీర సమైక్యవాది.. హరీష్ రావు ఆలింగనం!
By: Tupaki Desk | 18 July 2015 4:35 AM GMTటీజీ వెంకటేష్.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రత్యేక ఉద్యమాన్ని తన నిరాహార దీక్షతో తీవ్ర స్థాయికి తీసుకెళ్లినప్పుడు దానికి కౌంటర్లు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచిన వ్యక్తి. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలోతెలంగాణ ఉద్యమం ఊపందుకోగానే... చాలా మంది కాంగ్రెస్ నేతలు సమైక్యవాదులయ్యారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వీళ్లు వార్తల్లోకి వచ్చారు. తమ తమ ప్రకటనలతో వీరు కేసీఆర్ పై విరుచుకుపడే వారు. అలాంటి వారిలో టీజీ కూడా ఒకరు. ఆ తర్వాత వెంటనే టీజీ రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు.
దీంతో ఆయన వ్యాఖ్యనాలకు మరింత ప్రచారంలభించింది. అలా ఒకటీ రెండేళ్లు టీజీ వెంకటేష్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ మామూలే. కాంగ్రెస్ లో ఉంటూ సమైక్య ముద్ర సంపాదించుకోవడం కష్టం కదా.. దీంతో టీజీ సమైక్యవాద ఇమేజ్ కూడా ఎక్కువకాలం నిలవలేదు. అయితే ఎన్నికల ముందు చాలా మంది కాంగ్రెస్ నేతల వలే టీజీ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశాడు. తెలుగుదేశం పార్టీ అనుకూలుడిగా మారాడు. రాష్ట్ర విభజన జరిగిపోయింది. దీంతో టీజీ లాంటి సమైక్య యోధులకు ప్రాధాన్యత లేకుండా పోయింది.
ఇప్పుడు కూడా అడపాదడపా.. టీజీ ఏవో రాయలసీమ అనుకూల ప్రకటనలు చేస్తూ ఉంటాడు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నాడిప్పుడు. మరి ఇంత నేపథ్యం ఉన్న టీజీ తాజాగా వీర తెలంగాణ వాది హరీష్ రావుతో సఖ్యతతో కనిపించాడు. హైదరాబాద్ లో జరిగిన ఆర్యవైశ్య సమావేశం ఒకదానికి హరీష్ రావు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది ఆర్య వైశ్య ప్రముఖుల్లో టీజీ కూడా ఒకరు. ఇందులో హరీష్, టీజీలు ఆలింగనం చేసుకొన్నారు. మరి వీర సమైక్యవాది, వీర తెలంగాణ వాదుల మధ్య ఈ తరహా సాన్నిహిత్యం విశేషమే కదా!