Begin typing your search above and press return to search.
టీజీ సెటైర్ బాబు చేతగానితనం పైనేనా?
By: Tupaki Desk | 29 Aug 2016 8:26 AM GMTపవన్ కల్యాణ్ తెలుగుదేశం ఎంపీల గురించి చేసిన వ్యాఖ్యలు ఒక్కటొక్కటిగా దుమారంగా మారుతున్నాయి. ఇటీవలే రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన టీజీ వెంకటేష్ పవన్ కల్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ మాటకొస్తే పవన్ కల్యాణ్‌కు రిటార్ట్ ఇచ్చిన నాయకులు జేసీ - అవంతి శ్రీనివాస్ .. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. కానీ టీజీ వెంకటేశ్ తన మాటల్లో ఇండైరక్టుగా చంద్రబాబునాయుడు చేతగానితనాన్ని కూడా ఫోకస్ చేసి విమర్శలు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తోంది.
తెలుగుదేశం ఎంపీలకు సిగ్గులేదా అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు చీమకుట్టినట్లయినా అనిపించలేదు. పార్టీ తరఫున కనీసం అధికార ప్రతినిధి లాంటి వాళ్లు కూడా అధికారిక ప్రకటన చేయలేదు. చంద్రబాబునాయుడు తన రెండు కళ్ల సిద్ధాంతం మాదిరిగా... ఎవరూ నొచ్చుకోకూడదన్నట్లుగా పవన్ కల్యాణ్ చాలా మంచి పని చేస్తున్నారు.. అంటూ ఆయనను కీర్తించారు. అయితే పార్టీ ఎంపీలందరికీ పవన్ మీద మండుతోంది.
ఆ నేపథ్యంలనే టీజీ వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ తెదేపా ఎంపీల వైఫల్యం గురించి ఈ మాటలు ఏపీలో అన్నారు గనుక సరిపోయిందని, అదే మాటలు తమిళనాడులో గనుక అని ఉంటే జయలలిత ఆయన కాళ్లు - చేతులు విరగ్గొట్టించి ఇంట్లో కూర్చోబెట్టేదని టీజీ హెచ్చరించారు. అంటే తన పార్టీకి చెందిన ఎంపీలను స్థాయికి తగని విమర్శలతో ఎవరైనా ఆడిపోసుకుంటే జయలలిత అలా స్పందిస్తుందని, అదే చంద్రబాబు ఆ పాటి చేయకుండా పోయారని టీజీ ఆవేదన - కడుపుమంట ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. టీజీ పవన్ ను ఓ రేంజిలో ఆడుకున్నప్పటికీ.. చంద్రబాబు చేతగానితనం మీద కూడా ఆయన కడుపుమంట బయటపడుతోందని అందరూ అనుకుంటున్నారు.