Begin typing your search above and press return to search.
బాబు దగ్గర తన పలుకుబడిని చూపించిన టీజీ!
By: Tupaki Desk | 19 March 2019 4:52 AM GMTప్రముఖ పారిశ్రామికవేత్త.. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్థాయి ఏమిటో మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పాలి. రాజకీయాల్లో ఆయన తీరు మిగిలిన వారికి భిన్నంగా చెప్పాలి. ప్రజల్లో టీజీకి ఉన్న ఆదరణ ఎంతన్న విషయాన్ని పక్కన పెడితే.. తనకున్న పవర్ తో అధినాయకత్వాన్ని ప్రభావితం చేయటంలో టీజీ తర్వాతే ఎవరైనా.
ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో తన మాట నెగ్గేలా చేసుకోవటంలో టీజీకున్న టాలెంట్ మరే నేతకు ఉండదని చెప్పాలి. పవర్ ఉన్న చోటకు పాదరసం చందాన జారుకుపోయే ఆయన..ఒక్క దగ్గరా స్థిమితంగా ఉంటారని చెప్పలేం.
తన రాజకీయ వారసుడిగా రంగంలోకి వచ్చిన తన కుమారుడు టీజీ భరత్ కు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోవాలన్న పట్టును ఆయన నెగ్గించుకున్నారని చెప్పాలి. కర్నూలు అసెంబ్లీ టికట్ విషయంలో నెలకొన్న పంచాయితీ ఇప్పటిది కాదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికే సీటు అని మంత్రి నారా లోకేశ్ అభయమిచ్చినా.. చివరకు వచ్చేసరికి మాత్రం టీజీ కోరుకున్నట్లు ఆయన కుమారుడికే దక్కింది.
బుజ్జిగింపుల్లో టీజీ ఒక పట్టాన ఓకే చెప్పకపోవటం.. దేనికైనా సిద్ధమన్న సంకేతాలు ఇవ్వటం.. తనకు సీటు ఇస్తే గెలుపు పక్కా అన్న విషయాన్ని అధినేతకు అర్థమయ్యే భాషలో చెప్పిన తీరుతో మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసి టీజీ భరత్ కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేన్న మాటను చెప్పి మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇస్తానన్న హామీతో ఆయన్ను బరిలో నుంచి తప్పుకునేలా చేశారు.
మొత్తంగా చూస్తే.. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఎవరి సంగతి ఎలా ఉన్నా.. తన మాటను నెగ్గించుకోవటంలో టీజీ తన చతురతను ప్రదర్శించారని చెప్పాలి. ఎంపీగా బరిలో ఉన్న కోట్లకు అవసరమైన "అండదండలు" తాను చూసుకుంటానని.. అందుకు ప్రతిగా అసెంబ్లీ సీటు తన కొడుక్కి ఇవ్వాలన్న టీజీ వెంకటేశ్ మాట బాబు మీద బాగా ప్రభావం చూపినట్లుగా చెబుతున్నారు.