Begin typing your search above and press return to search.
అదేంది టీజీ.. లోకేశ్ అంత వీకా?
By: Tupaki Desk | 12 July 2018 6:19 AM GMTసంచలన వ్యాఖ్యలు చేయటం టీడీపీ ఎంపీ(రాజ్యసభ) టీజీ వెంకటేశ్‌కు కొత్తేం కాదు. తన రాజకీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లనంతవరకూ వినయ విధేయతలతో వ్యవహరించే ఆయన.. తనకే మాత్రం నష్టం వాటిల్లినా ఉగ్రుడైపోతారన్న పేరుంది. వాస్తవానికి టీజీ ఏం చేయగలరన్న మాట చాలామంది అనుకుంటారు కానీ.. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆయనకు మాత్రం వేరే ఇమేజ్ ఉంది. అక్కడి రాజకీయాల్లో బలమైన ముద్రను వేసే సామాజిక వర్గానికి ధీటుగా వ్యవహరించే సత్తా టీజీ సొంతం.
కర్నూలు జిల్లాలో సంపన్న నేతలకు కొదవలేదు. పైకి కనిపించే నేతలకున్న సంపద లెక్కలు చూస్తే.. కర్నూలు జిల్లా నేతలు ఆర్థికంగా ఇంత సౌండా? అని విస్మయానికి గురి కాక తప్పదు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న నేతలు మొదలుకొని.. ఈ మధ్యన ఛరిష్మా తగ్గిన నేతల వరకూ వారి ఆస్తిపాస్తుల్ని చూస్తే వారెంత బలవంతులో తెలుస్తుంది. ఆర్థికంగా బలంగా ఉండటమే కాదు.. కర్నూలు తరహా రాజకీయాల్లో నెగ్గుకురావటం అంటే ఆషామాషీ కాదు. అలాంటి వాటిని అలవోకగా ఎదుర్కొనే టీజీ వెంకటేశ్‌కు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే పెద్ద విషయమే కాదు.
ఆ ధీమానే సీఎం కొడుకు కమ్ మంత్రి లోకేశ్ మీద పంచ్ లు వేసే వరకూ తీసుకెళ్లింది. తనను ముందుగా సంప్రదించకుండా.. తన కొడుకును ఎమ్మెల్యే కాకుండా అడ్డుపడేలా లోకేశ్ చేసిన తాజా ప్రకటన ఆయనకు ఒళ్లు మండేలా చేసింది. అందుకే లోకేశ్ అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా తనదైన శైలిలో పంచ్ లు వేశారు.
ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఓట్లు వేసి గెలిపించాలని మంత్రి లోకేశ్ చెప్పటం నాకు అర్థం కావటం లేదు.. మంత్రి లోకేశ్ ను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారేమో? అంటూ ఆయన తనదైన రీతిలో చురకలు అంటించారు.
టీజీ మాటలు విన్న తర్వాత పలువురు తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. చూస్తూ.. చూస్తూ లోకేశ్ తో పెట్టుకోవటానికి కూడా టీజీ వెనుకాడటం లేదే? అన్నది చర్చగా మారింది. తనకున్న సంపద శక్తితో ఏదైనా చేయగలనన్న నమ్మకమే టీజీ చేత అలా మాట్లాడించిందని చెబుతారు.
తన ప్రయోజనాలకు దెబ్బ తగలనంత వరకూ తాను మామూలుగానే ఉంటానని.. కానీ తనను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే.. అవతలోళ్లు ఎంతటి వారైనా సరే.. షాకులు తప్పవన్న వైనాన్ని టీజీ తాజాగా స్పష్టం చేసినట్లుగా చెప్పక తప్పదు. కాంగ్రెస్ లాంటి పార్టీలోనే మంత్రి పదవిని సొంతం చేసుకున్న సత్తా ఉన్న టీజీకి లోకేశ్ ఎంత? ఇదిలా ఉంటే.. టీజీ మాటలపై ఇప్పుడు జోకులు వినిపిస్తున్నాయి. లోకేశ్ ను హిప్నటైజ్ చేసినట్లున్నారన్న టీజీ మాటలకు పలువురు.. చినబాబు అంత వీకా టీజీ?. ఎమ్మెల్యే చేసే హిప్నటైజ్ కే ఆయన పడిపోతారా టీజీ ? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతకంతకూ చెలరేగిపోతున్న టీజీకి బాబు ఎలా కూల్ చేస్తారో చూడాలి.