Begin typing your search above and press return to search.
వైసీపీ ఎదురు దాడి!... యామినీకి అంత సీన్ లేదట!
By: Tupaki Desk | 31 March 2019 12:08 PM GMTటీడీపీ అధికార ప్రతినిధిగా ఇప్పుడు అటు టీవీ లైవ్ షోలతో పాటు మీడియా సమావేశాలు, సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉన్న వారిలో సాధినేని యామినీ శర్మ పేరునే ముందుగా చెప్పుకోవాలి. ఏ ఏడాది క్రితం దాకా అసలు యామినీ అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంటే... చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసిన యామినీ... టీడీపీ పక్షాన వైరి వర్గాలను దునుమాడేద్దామంటూ ఎంట్రీ ఇవ్వడం, వైరి వర్గాలకు అడ్డంగా బుక్కైపోతుండటం మనకు తెలిసిందే. మొన్నామధ్య జనసేనపై వ్యాఖ్యలు చేసి ఆ పార్టీ కార్యకర్తల చేతిలో తీవ్రంగా అభాసుపాలై కన్నీళ్లు పెట్టుకుంటూ లైవ్ షో నుంచి వెళ్లిపోయిన యామినీ... తను మాట్లాడేదంతా చిల్లర రాజకీయమేనని తనకు తానే నిరూపించేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.
అయినా గానీ... ఏమాత్రం వెనక్కు తగ్గని యామినీ... ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు బుద్ధి చెప్పేందుకు వైసీపీ మహిళా నేత తాడి శకుంతల రంగంలోకి దిగేశారు. బెజవాడ మాజీ మేయర్ గా పనిచేసిన శకుంతల నేటి మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చిన యామినీ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అంతేకాకుండా యామినీ వైఖరిని ప్రశ్నిస్తూ... ఆమె మాట తీరును ప్రశ్నిస్తూ శకుంతల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యామినీతో పాటు ఆ పార్టీ కీలక నేతలుగాన్న నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ లకూ తగిలేశాయి.
అయినా శకుంతల ఏమన్నారన్న విషయానికి వస్తే... *వైఎస్ కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత నీకు లేదు. టీడీపీలో ఉన్న మీరంతా వలస పక్షులు. వైఎస్ జగన్ పెంపకంపై యామినీ మాడ్లాడటం హాస్యాస్పదం. నెల జీతానికి పనిచేసే యామినీ వైఎస్ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం ఆమె తెలివి తక్కువతనానికి నిదర్శనం. తేడా నేతలు అంటే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైఎస్ కుటుంబం ప్రజలతో ఎలా మమేకం అయ్యిందో చరిత్ర చూసి తెలుసుకోవాలి’ అని శకుంతల ఓ రేంజిలో ఫైరయ్యారు. మొత్తంగా యామినీ తన వ్యాఖ్యలతో ఇప్పుడు బాలయ్యతో పాటు లోకేశ్ ను కూడా బజారుకీడ్చినట్టైందన్న వాదన వినిపిస్తోంది.