Begin typing your search above and press return to search.

గుహ‌లో ఏం చేశామో చెప్పిన వైల్డ్ బోర్స్ పిడుగులు

By:  Tupaki Desk   |   19 July 2018 4:14 AM GMT
గుహ‌లో ఏం చేశామో చెప్పిన వైల్డ్ బోర్స్ పిడుగులు
X
మృత్యువుతో ఆటలు ఆడ‌టం.. అది కూడా చిన్నారులు కావ‌టం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన వైనం తెలిసిందే. ప్ర‌మాద‌క‌ర గుహ‌లోకి వెళ్లి అక్క‌డ చిక్కుకుపోయిన బాల‌ల‌ను ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీసుకురావ‌టం ప్ర‌పంచం మొత్తాన్ని క‌దిలించిన సంగ‌తి తెలిసిందే. ఓ అద్భుతంగా మారిన వైల్డ్ బోర్స్ ఫుట్ బాల్ స‌భ్యుల రెస్క్యూ ఆప‌రేష‌న్ అనంత‌రం పిల్ల‌ల్ని ఆసుప‌త్రిలో చికిత్స అందించ‌టం తెలిసిందే.

పూర్తిగా కోలుకున్న పిల్ల‌ల‌ను తాజాగా ఇంటికి పంపారు. ఈ క్ర‌మంలో వారు మీడియాతో మాట్లాడారు. గుహ‌లో చిక్కుకున్న తాము ఎలాంటి ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్న విష‌యాన్ని.. గుహ‌లో తామేం చేసింది చెప్పుకొచ్చారు. గుహ‌లో ఉన్న త‌మ‌ను అధికారులు గుర్తించే వ‌ర‌కూ వాన తీరు తాగి ప్రాణాలు నిల‌బెట్టుకున్న‌ట్లు చెప్పారు.

నిజానికి అధికారుల కోసం వెయిట్ చేయ‌కుండా గుహ‌ను త‌వ్వుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌న్న ఆలోచ‌న చేసిన‌ట్లుగా వారు చెప్పారు. థాయ్ లాండ్ గుహ‌లోకి వెళ్ల చిక్కుకుపోయిన పిల్ల‌ల్ని ర‌క్షించిన అనంత‌రం వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందించ‌టం తెలిసిందే. ఈ నెల 10న బ‌య‌ట‌ప‌డిన 12 మంది ఆట‌గాళ్లు.. కోచ్ బుధ‌వారం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కిక్కిరిసిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన వారు త‌మ భ‌యాన‌క అనుభ‌వాల్ని వెల్ల‌డించారు. ఆట‌గాళ్ల‌ను జ‌ర్న‌లిస్టులు క‌నీసం నెల రోజులు క‌ల‌వ‌కూడ‌ద‌న్న మాట‌ను వైద్యులు తల్లిదండ్రుల‌కు సూచ‌న చేశారు. మీడియా స‌మావేశం అనంత‌రం ప్ర‌త్యేక వాహ‌నాల్లో ఆట‌గాళ్ల‌ను ఇళ్ల‌కు త‌ర‌లించారు.