Begin typing your search above and press return to search.
జనాలపై సైనికుడి కాల్పులు.. 21మంది మృతి
By: Tupaki Desk | 9 Feb 2020 5:50 AM GMTథాయిలాండ్ దేశంలో ఓ సైనికుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. సామాన్య జనాలపై కాల్పులకు దిగి ఘోరానికి పాల్పడ్డాడు. ఖోరత్ ప్రాంతంలోకి తుపాకీతో చేరిన సైనికుడు వాహనంపై తిరుగుతూ జనాలపై కాల్పులు జరుపుతూ మరమృందంగం వినిపించాడు..
ఆర్మీ బ్యారక్ నుంచి తుపాకీ, వాహనాన్ని చోరీచేసిన సైనికుడు కాల్పులతో హోరెత్తించాడు. ఓ షాపింగ్ మాల్ లోకి చొరబడి కాల్పులకు దిగాడు. సైనికుడి కాల్పుల్లో మొత్తం 21మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రజలను బందీగా చేసుకొని అరాచకం సృష్టించాడు. పదుల సంఖ్యలో వారికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని థాయ్ లాండ్ అధికారులు పేర్కొన్నారు
కాల్పుల ఘటన బయటకు రాగానే పోలీసులు, అధికారులు అక్కడికి చేరి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాల్ నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. ఎన్ కౌంటర్ చేసైనా సరే నిందితుడి ఆగడాల్ని ఆపాలని థాయ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.