Begin typing your search above and press return to search.

సముద్రంలో మునిగిన థాయ్ నేవీ షిప్.. 31 మంది గల్లంతు..!

By:  Tupaki Desk   |   19 Dec 2022 8:32 AM GMT
సముద్రంలో మునిగిన థాయ్ నేవీ షిప్.. 31 మంది గల్లంతు..!
X
ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఊహించడం కష్టం. రోడ్డుపై వాహనాలు తరుచూ ప్రమాదాలకు గురవుతూ అనేక మంది మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం ప్రతీరోజూ వింటూనే ఉంటాం. అలాగే పట్టాలపై వెళుతున్న రైళ్లు.. ఆకాశంలో ఎగిరే విమానాలు.. సముద్రంలో ప్రయాణించే నౌకలు సైతం ఇటీవల కాలంలో తరుచూ ప్రమాదాల బారిన పడుతూ వార్తల్లో నిలుస్తుంటడం గమనార్హం.

తాజాగా థాయిలాండ్ నౌకా దళానికి చెందిన ఒక షిప్ ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది. గల్ఫ్ థాయిలాండ్ ప్రాంతంలో భారీ తుఫాను కారణంగా హెచ్టీఎంఎస్ సుఖోటాయి అనే నావిక దళానికి చెందిన షిప్ సముద్రంలో మునిగి పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగినపుడు షిప్ లో 106 మంది నావికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

వీరిలో 75 మంది నావికులకు నౌక దళ సహాయ సిబ్బంది కాపాడగా మరో 31 మంది ఆచూకీ లభించడం లేదని పేర్కొన్నారు. వీరి కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నామని వివరించారు. వీరి కోసం హెలికాప్టర్.. ఇతర నౌకలతో సహాయ చర్యలు చేపడుతున్నట్లు నౌక దళం ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కాగా థాయ్ నౌక గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ కు చేరుకోగానే తుఫాను కారణంగా నౌకలో ఒక్కసారిగా పవర్ పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నౌకలోని నీరు చేరింది. దీంతో షిప్ ను కంట్రోల్ లోకి తెచ్చేందుకు నావిక సిబ్బంది తెగ ప్రయత్నాలు చేశారు. బంగ్ సఫాన్ జిల్లాకు 32 కిలోమీటర్ల దూరంలో థాయిలాండ్ నౌక పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ షిప్ లోని నావికులను కొంత మందిని బయటికి వెలికితీశారు. మరికొందరి కోసం హెలికాప్టర్ ద్వారా గాలింపులు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఒక్కరు కూడా మృతి చెందలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాణాలతో బయట పడిన వారిలో ముగ్గురి పరిస్థితి మాత్రం విషయం ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారి కోసం నౌక దళం రెస్క్యూ ఆపరేషన్ నిన్నటి నుంచి చేస్తూనే ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.