Begin typing your search above and press return to search.
50 బిలియన్ డాలర్ల నష్టం.. థాయిలాండ్ తలుపులు తెరిచింది
By: Tupaki Desk | 17 Jun 2021 2:30 AM GMTఒక సంవత్సరానికి పైగా విదేశీ ప్రయాణికులను కరోనా వైరస్ కారణంగా థాయ్ లాండ్ దేశం నిషేధించింది. దీంతో థాయిలాండ్ పర్యాటకంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలోనే కరోనా ఇప్పుడు తగ్గడంతో త్వరలో పర్యాటకులకు తలుపులు తెరుస్తోంది.
వచ్చే 120 రోజుల్లో అంటే 4 నెలల్లో సందర్శకులకు పూర్తిగా ద్వారాలు తిరిగి తెరవాలని యోచిస్తున్నట్టు థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓచా బుధవారం చెప్పారు. గత ఏడాది కాలంగా పర్యాటక ఆదాయంలో థాలియాండ్ 50 బిలియన్ డాలర్లను కోల్పోయిందని.. ఇది 82 శాతం పతనమైందని చెప్పుకొచ్చారు.
థాయ్ లాండ్ పర్యాటక-ఆధారిత దేశం. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటానికి పర్యాటకమే ప్రధాన ఆదాయం. నిర్బంధ అవసరం లేకుండా స్థానిక మరియు విదేశీ వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు దేశంలోకి ఎంట్రీ ఉంటుందని థాయ్ లాండ్ ప్రధాని తెలిపారు. "దేశాన్ని తిరిగి తెరవడం అనేది ఆదాయాన్ని సంపాదించగల సామర్థ్యాన్ని కోల్పోయిన ప్రజల అపారమైన బాధలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అన్ లాక్ ముఖ్యమైన మార్గాలలో ఒకటి" అని ఆయన చెప్పారు.
ఈ సంవత్సరానికి 105.5 మిలియన్ మోతాదుల కరోనావైరస్ వ్యాక్సిన్ లు దేశానికి అందాయని.. దేశంలో అనుకున్న లక్ష్యం కంటే ముందంజలో ఉందని, వచ్చే ఏడాది మరిన్ని వ్యాక్సిన్ లు వస్తాయని పీఎం ప్రయాత్ చెప్పారు. జూలై నుండి ప్రతి నెల సగటున 10 మిలియన్ డోసుల కరోనావైరస్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించాలని దేశం యోచిస్తోంది.
అయితే థాలియాండ్ లో పెరుగుతున్న కేసులు పర్యాటకులకు గొప్ప ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ జనాభాలో ఇప్పటివరకు 3 శాతం మాత్రమే టీకాలు వేశారు. ఈ సంవత్సరం నాటికి 70 శాతం జనాభాకు పూర్తిగా టీకాలు వేస్తామని దేశం చెబుతుండగా అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.