Begin typing your search above and press return to search.
అమ్మ సీటులో స్టార్ హీరోనా..?
By: Tupaki Desk | 8 Oct 2016 6:19 AM GMTతమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత ఆరోగ్యం విషమించటం.. హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించటం తెలిసిందే. అమ్మకు వైద్యం చేయటం మొదలెట్టి 17 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఆమె పరిస్థితి ఎలా ఉంది? అన్న విషయంలో పలు సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. అమ్మను పలుకరించటానికి.. పరామర్శించటానికి శనివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వస్తే.. ఈ రోజు ప్రధాని మోడీ వస్తున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. బీజేపీ నేతలే తమిళనాడులో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్లు తెరపైకి వస్తున్న వేళ.. అమ్మ స్థానంలో అపథర్మ (ఆ మాట సరికాదేమో)లేదంటే.. తాత్కాలీన ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వంను కూర్చోబెట్టాలని.. అది సాధ్యం కాకుంటే.. ఉప ముఖ్యమంత్రిగా ఆయన్ను ప్రమాణ స్వీకారం చేయించి.. పాలనా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి.
ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఇన్ ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పలుమార్లు చర్చించటం.. గవర్నర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. పన్నీరు సెల్వం కాకుండా.. ఆయన స్థానంలో సీఎం పదవిని చేపట్టే వారికి సంబంధించి సోషల్ మీడియా మొదలైన చర్చ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాట స్టార్ హీరోగా వెలుగొందుతూ.. తనదైన వ్యక్తిత్వంతో అందరి మనసుల్ని దోచుకునే ప్రఖ్యాత నటుడు అజిత్ పేరును ముఖ్యమంత్రి స్థానానికి లింకు పెడుతూ వస్తున్న సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో భారీగా మొదలైన ఈ చర్చలో లాజిక్ వెతికే వారి కోసమే అన్నట్లుగా ఒక పోస్టింగ్ కనిపిస్తోంది. అదేమంటే.. అజిత్ ను ఉద్దేశించి గతంలో అమ్మ అన్న మాటలుగా ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుత నటుల్లో నా చరిష్మా.. నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అజిత్. నా వారసుడి లక్షణాలు ఆయనలోనే ఎక్కువగా ఉన్నాయి’’ అని తన సన్నిహితుల వద్ద గతంలో అమ్మ అన్నట్లుగా చెబుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తుంది. మరి.. అది నిజమా..? కాదా? అన్నది తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తాయని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/