Begin typing your search above and press return to search.

తమ్మినేని సీతారాం.. ఫిరాయింపుల పై లేటెస్ట్ కామెంట్!

By:  Tupaki Desk   |   16 Nov 2019 6:59 AM GMT
తమ్మినేని సీతారాం.. ఫిరాయింపుల పై లేటెస్ట్ కామెంట్!
X
ఒక వైపు తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బయట కు వస్తారని ప్రచారం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు విజయవాడ లో నిర్వహించిన దీక్ష కు ఏకంగా పదిహేను మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. వారిలో కొందరు బీజేపీ వైపు చూస్తున్నారని, మరి కొందరు వైసీపీ వైపు చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది.

వల్లభనేని వంశీ మోహన్ అయితే తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసినట్టు గా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పై ఆయన తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తుతూ ఉన్నారు కూడా. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీ కార్య కలాపాలకు పూర్తి గా దూరం అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

తన తో పాటు మరి కొందరు ఎమ్మెల్యే లను తీసుకుని ఆయన బీజేపీ లోకి చేరే అవకాశాలున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తి దాయకమైన వ్యాఖ్యలు చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యే లను క్షమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎవరు ఎటు ఫిరాయించినా అనర్హత వేటు తప్పదని ఆయన వ్యాఖ్యానించారు! తద్వారా రాష్ట్రం లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పై చర్చ జరుగుతున్న వేళ తమ్మినేని ఆసక్తి దాయకమైన వ్యాఖ్యలు చేశారు.

ఇది వరకూ అసెంబ్లీ లో కూడా అదే విషయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పారు. ఫిరాయింపు దారులను తమ ప్రభుత్వం ఎంటర్ టైన్ చేయదని ఆయన అన్నారు. ఫిరాయింపుదారుల పై అనర్హత వేటు తప్పదని స్పీకర్ కూడా అప్పుడు ప్రకటించారు. మరోసారి అదే విషయాన్ని తమ్మినేని పునరుద్ఘాటించడం విశేషం.