Begin typing your search above and press return to search.
పాకిస్తాన్ కు శివసేన థ్యాంక్స్
By: Tupaki Desk | 2 Nov 2015 3:03 PM GMTమరాఠ పులిబిడ్డల వారసత్వ పార్టీ, శివసైనికులు పేరుతో పాకిస్తాన్ అంటేనే విరుచుకుపడే శివసేన ఇపుడు అదే పాకిస్తాన్ కు థ్యాంక్స్ చెప్పింది. ఏంటి నమ్మబుద్ధికావడం లేదా? నిజంగా నిజమండి బాబు. ఇది నిజమని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారో...శివసేన థ్యాంక్స్ చెప్పినందుకు కారణం తెలుసుకుంటే అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపోతారు మరి.
శివసేనను ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ అభివర్ణిస్తూ... అంతర్జాతీయ సమాజం శివసేన కార్యకలాపాలపై నిఘా ఉంచాలని కొద్ది రోజుల క్రితం కోరింది. ఈ విషయమై శివసేన తాజాగా స్పందిస్తూ...తమ సంస్థను ఉగ్ర సంస్థగా పేర్కొనడం పట్ల థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు...పొరుగు దేశం విషయంలో శివసేన ఎన్నడూ రాజీపడదని స్పష్టం చేసింది.
శివసేన అధికార పత్రిక సామ్నా తాజా సంపాదకీయంలో ఈ మేరకు స్పష్టం చేసింది. పాకిస్థాన్ శత్రువుగా భావించడం తమకు గర్వకారణమని శివసేన స్పష్టం చేసింది. పాకిస్థాన్ శత్రువుగా భావించడం తమకు పరమ వీర చక్ర అవార్డుతో సమానమని సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. పాక్ ఉగ్ర సంస్థల హిట్ లిస్ట్ లో ఉండటం తనకు గర్వకారణమని శివసేన వ్యవస్థాపక నేత దివంగత బాల్ థాకరే తరచూ చెబుతుండేవారని సామ్నా సంపాదకీయం పేర్కొంది.