Begin typing your search above and press return to search.
ఇంకా చెట్ల కిందే కొత్త పాలన.. ఏపీలో దుస్థితి!!
By: Tupaki Desk | 29 July 2022 11:30 PM GMTఔను.. ఇప్పటికీ.. చెట్ల కిందే ఉద్యోగులు భోజనాలు చేస్తున్నారు. రెండు చెట్ల కింద టేబుల్ వేసుకుని.. అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇదేదో.. ఎక్కడో వెనుకబడిన దేశంలో జరుగుతున్న తంతు కాదు.. ఏపీలోనే! రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్తున్నామని చెబుతున్నవైసీపీ పాలనలోనే అధి కారులు నానా అగచాట్లు పడుతున్నారు. దీనికి కారణం.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలే! ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ.. జిల్లాల విభజన అనేక అగచాట్లకు వేదికగా మారింది.
రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలు గా మారుస్తానని.. ఎన్నికలకు ముందు .. జగన్‌హామీ ఇచ్చారు. అనుకున్న ప్రకారం.. 25 కాకుండా.. అరకు నియోజకవర్గాన్ని రెండు నియోజకవర్గాలు గా పెంచారు. దీంతో 26 జిల్లాలు ఏర్పడ్డాయి.
అయితే.. పాత జిల్లాల నుంచిఏర్పడిన కొత్త జిల్లాల్లో ఇప్పటికీ.. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. కొత్త జిల్లాలు ఏర్పడి.. 100 రోజులు పూర్తయ్యాయి. కేవలం 50 రోజుల్లోనే ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ.. నిధుల సమస్య వెంటాడుతోంది.
ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లాలో .. డిప్యూటీ తహసీల్దార్.. చెట్టు కింద పంచాయతీ పెట్టారు. దీంతో వర్షం పడడంతో కాయితాలు తడిచిపోయాయి. ఇక, తహసీల్దార్‌లు కేవలం వచ్చి.. వెళ్లిపోతున్నారు తప్ప.. పనిమాత్రం చేయడం లేదు. దీంతో ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. పోనీ.. పాత జిల్లాలకు వెళ్లి పనులు చేయించుకుందామన్నా.. మీ జిల్లా కేంద్రం మారిపోయింది.. అక్కడికే వెళ్లండని.. అధికారులు పనులు చేయడం లేదు. పోనీ.. కొత్త జిల్లాలకు వెళ్తే.. పరిస్థితి ఇది.
మరి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి.. ప్రభుత్వం సాధించింది ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు.. కొత్త జిల్లాలను ఇలా ఏర్పాటు చేశారో.. లేదో.. అలా.. ఆస్తుల విలువ ను పెంచేశారు. ఫలితంగా పన్నుల బాదుడు ప్రారంభమైంది. ప్రతి ఇంటిపైనా.. అసాధారణంగా పన్నులు పెంచారు.
అదేవిధంగా మంచినీటి పన్నులు కూడా నగరాలతో సమానంగా పెంచారు. దీనికి సంబంధించి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండానే.. ఇలా చేయడం ఏంటనేది.. ప్రజల మాట. మరి ఇప్పటికైనా..కొత్త జిల్లాల్లోల ఏర్పాట్లు చేస్తారా? అనేది ప్రశ్న.