Begin typing your search above and press return to search.

అంతుచిక్కని రీతిలో ఆ 20 ఏళ్ల అమ్మాయి?

By:  Tupaki Desk   |   20 May 2020 8:30 AM GMT
అంతుచిక్కని రీతిలో ఆ 20 ఏళ్ల అమ్మాయి?
X
రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా పరుగులు పెట్టే ప్రపంచానికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటమే కాదు.. వారాల తరబడి నిద్రాణంలో ఉండిపోయేలా చేసింది మాయదారి మహమ్మారి. ప్రపంచానికి వణుకు పుట్టించటమే కాదు.. తన దెబ్బతో ఎన్నో సంపన్న దేశాలు కుదేలు అయ్యేలా చేయటంలో వూహాన్ నగరంలో పుట్టిన వైరస్ కీలకమైంది. దీని ప్రభావం ఎంతన్న విషయం పై ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చేసింది.

ఈ రోగం సోకిన వారితో సమస్య లేదు. కానీ.. సోకని ఒక అమ్మాయి సైంటిస్టులకు కొరుకుడు పడనిగా మారింది. అప్పటి వరకూ ఈ మాయదారి రోగ లక్షణాలున్న వారి ద్వారా సోకటం ఒక ఎత్తు అయితే.. ఎంతగా చూసినా.. మరెంతగా పరీక్షలు జరిపినా.. ఫలితం నెగిటివ్ వచ్చే వూహాన్ మహిళ లో వైరస్ ఉండటమే కాదు.. ఆమె ద్వారా ఇతరులకు వ్యాపించిన వైనాన్ని గుర్తించారు.

వూహాన్ కు చెందిన 20 ఏళ్ల మహిళకు పరీక్ష చేస్తే మాయదారి రోగం వచ్చిన దాఖలాలు లేవు. పరీక్షలు చేసినా నెగిటివ్ ఫలితమే వచ్చే పరిస్థితి.కానీ.. ఆమె ద్వారా మరో ఐదుగురికి వ్యాపించిన వైనం సైంటిస్టులకు ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఇలాంటి తీరు ప్రపంచంలో తొలిసారి ప్రదర్శించింది మాత్రం వూహాన్ నగరానికి చెందిన అమ్మాయే. ఆమె తరహాలోనే పలువురు పైకి నెగిటివ్ ఉన్నా.. వారి ద్వారా మాత్రం పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంఖ్య ఎక్కువ అవుతోంది. ఈ తరహా కేసులకు మూలమైన వూహాన్ అమ్మాయి మిస్టరీ గా మారటమే కాదు.. సైంటిస్టులకు సవాలుగా మారిందని చెప్పక తప్పదు.