Begin typing your search above and press return to search.
సూర్యుడ్ని కోల్పోయిన ఆ బీచ్ ... ప్రాయియా సెంట్రల్ బీచ్ ప్రత్యేకత ఏమిటంటే !
By: Tupaki Desk | 15 Jan 2021 11:30 PM GMTబాలెనారియో కాంబోరియు ... దీన్నే బ్రెజిలియన్ దుబాయ్ అని పిలుస్తారు. ఈ నగరంలో సుమారు ఒకటిన్నర లక్షల మంది నివసిస్తున్నారు. ఈ నగరానికి మరో ఒక ఆశ్చర్యకరమైన రికార్డు ఉంది. సావో పాలో, రియో డి జెనీరో వంటి మెగా నగరాల పరిమాణంతో పోలిస్తే అతి చిన్న నగరం బాలెనారియో కాంబోరియు. అయినా కానీ, దక్షిణ అమెరికా ఖండంలోని టాప్ టెన్ అతి ఎత్తైన నివాస భవనాల్లో ఆరు భవనాలు ఈ నగరంలోనే ఉన్నాయని కౌన్సిల్ ఆఫ్ టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హాబిటేట్ సమాచారం చెప్తోంది.
కానీ , ఈ ఖ్యాతితో పాటు ఒక చీకటి కోణం కూడా ఉంది. ఈ అత్యంత పొడవైన భవనాలు ఎక్కువ భాగం ప్రఖ్యాత బీచ్ ప్రాయియా సెంట్రల్ వెంటే ఉన్నాయి. ఈ భవనాలు ఎంత ఎత్తుగా, ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఈ బీచ్ సూర్యుడ్ని కోల్పోయింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ ఆకాశహర్మ్యాలు సూర్యుడ్ని అడ్డుకుంటాయి. బీచ్ మొత్తం నీడలో మునిగిపోతుంది. ఆ భవనాల నీడలు ఈ బీచ్‌ను ఎలా కబళిస్తున్నాయో వివరించే ఫొటోలు, టైమ్ ల్యాప్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ భవనాల మధ్య సన్నని సందుల నుంచి వచ్చే సూర్యుడి వెలుతురులో జనం ఇరుకుగా చేరి సన్ బాత్ చేయాల్సి రావటం మరింత దారుణం అని స్థానికులు చెప్తున్నారు.
ఇలావున్నా కూడా ప్రాయియా సెంట్రల్ ఇంకా అత్యంత ప్రజాదరణ గల బీచ్‌గానే కొనసాగుతోంది. కరోనా కాలంలో కూడా ఎండ ఉన్న రోజుల్లో బీచ్ అభిమానులు ఆంక్షలను ధిక్కరించి మరీ రావడంతో ఈ బీచ్ రద్దీగానే ఉంది. ప్రాయియా సెంట్రల్ బీచ్ అనేది ఇప్పుడు కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదని, మెరుపులీనే ఈ ఎత్తైన భవనాల వల్ల అంతకన్నా కాస్త ఎక్కువగానే మారిందని సిల్వా వంటి స్థానికులు చెప్తున్నారు. చరిత్రకారుడు ఇసాకాబార్బా వంటి వారు.. లేని సమస్య గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తమవుతోందని అంటారు. బాలెనారియో కాంబోరియు నిజంగా ఇప్పటికీ చాలా ప్రజాదరణ గల పర్యాటక కేంద్రం.
2019లో దాదాపు పది లక్షల మంది ఈ నగరాన్ని సందర్శించారని పర్యాటక అధికారులు చెప్తున్నారు. మొత్తం బ్రెజిల్ లో అత్యధికంగా పర్యాటకులు వచ్చిన ప్రాంతాల్లో ఇదొకటిగా నిలిచింది. ఈ నగరం.. సంపన్నులకు, ప్రముఖులకు ప్రీతిపాత్రమైన క్రీడామైదానం కూడా: ఫుట్ బాల్ క్రీడాకారుడు నేమర్ ఈ ఏడాది ఆరంభంలో ఈ నగరంలోని ఒక కొత్త లగ్జరీ అపార్ట్‌మెంట్ లో 57 లక్షల డాలర్లతో ఒక పెంట్ హౌస్ ను కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు. నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్ లతో కూడిన విస్తారమైన వినోద రంగం కూడా దేశీయంగా, అంతర్జాతీయంగా సందర్శకులను ఆకర్షిస్తోంది. ప్రాయియా సెంట్రల్ లో లండన్ ఐ తరహా జెయింట్ వీల్ కూడా ఉంది. ఈ ఖండం మీద అతి ఎత్తైన జెయింట్ వీల్స్ లో ఇదొకటి.