Begin typing your search above and press return to search.

ఆ పిల్లికి 3 నెలల క్వారంటైన్ పూర్తి.. ఇప్పుడెక్కడ ఉందంటే?

By:  Tupaki Desk   |   25 May 2020 11:00 AM IST
ఆ పిల్లికి 3 నెలల క్వారంటైన్ పూర్తి.. ఇప్పుడెక్కడ ఉందంటే?
X
మూడు నెలల క్రితం..చైనా పిల్లి ఒకటి సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మాయదారి రోగానికి సంబంధించిన అంశాలు అప్పుడప్పుడే బయటపడుతున్న వేళ.. చైనా నుంచి వచ్చిన ఒక బొమ్మల కంటైనర్ లో ఒక పిల్లి ఉండటంతో ఉలిక్కిపడ్డారు. అదెందుకు ఉంది? అందులోకి ఎలా వచ్చిందన్నది ప్రశ్నగా మారింది.

ముదురుగోధుమ రంగులో ఉన్న ఆ ఆడపిల్లిని అధికారులు స్వాధీనం చేసుకొని క్వారంటైన్ కు తరలించారు. మూడు నెలల క్వారంటైన్ ను ముగించుకున్న ఆ పిల్లిని తాజాగా చెన్నైలోని ఒక ఎన్జీవోకు అప్పగించారు. గడిచిన మూడు నెలలుగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవటంతో దాన్ని బయట ప్రపంచానికి అనుమతించారు. ఈ పిల్లి విషయంలో బీజేపీ ఎంపీ మేనకాగాంధీ.. పెటా సంస్థలు కలుగుజేసుకోవటంతోనే పిల్లికి క్వారంటైన్ నుంచి విముక్తి లభించింది.