Begin typing your search above and press return to search.
న్యూ ఇయర్ హోటల్ బుకింగ్స్ లో ఆ నగరానిదే పైచేయి..!
By: Tupaki Desk | 3 Jan 2023 3:28 AM GMTన్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం నగరవాసులు ఎక్కువగా గోవా వైపు చూస్తుంటారు. గోవా బీచ్ లో జరిగే న్యూ ఇయర్ వేడుకలకు అక్కడి నిర్వాహాకులు ప్రతి యేటా అద్భుతంగా నిర్వహిస్తుంటారు. ఈక్రమంలోనే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతోపాటు విదేశీయులు గోవాలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతుంటారు.
ఈ ఏడాది కూడా గోవాలో న్యూ సంబరాలు ఘనంగా జరిగాయి. యూత్ మొత్తం ముందస్తుగా గోవాలో హోటల్ బుకింగ్ చేసుకున్నారు. దీంతో అక్కడి హోటల్ రూములన్నీ ఫుల్ గా నిండిపోయాయి. అయితే గోవా కంటే ఎక్కువగా మరో నగరంలో డిసెంబర్ 31 నైట్ హోటల్ బుకింగ్స్ జరిగినట్లు ఓయో వ్యవస్థాపకుడు.. సీఈవో రితేష్ అగర్వాల్ వెల్లడించారు.
ఓయోలో డిసెంబర్ 31 వరకు గోవాలో గంట గంటకు బుకింగ్స్ పెరిగిపోయాయని తెలిపారు. అయితే ఆ గోవా కంటే అధికంగా వారణాసిలో ఎక్కువగా హోటల్ బుకింగ్స్ జరిగాయని ఆయన వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే ప్రజలంతా అధ్యాత్మికత.. శాంతిని ఎక్కువగా కోరుకుంటున్నారనే విషయం వెల్లడైందని ఆయన ట్వీట్ చేశారు.
పర్యాటక పరంగా గోవాను ప్రజలు ఎలా చూస్తున్నారో అలాగే మతపరమైన నగరాల వైపు వారంతా చూస్తున్నారనే విషయం న్యూ ఇయర్ సందర్భంగా ఓయోలో నమోదైన హోటల్ బుక్సింగ్స్ పరిశీలిస్తే అర్థమవుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఓయో 700 నగరాల్లో సేవలు అందిస్తుండగా వారణాసినే టాప్ లో నిలిచిందన్నారు.
మరోవైపు 2022లో కోవిడ్ భయం తగ్గడంతో ప్రజలంతా పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు మొగ్గుచూపారు. ఈ క్రమంలోనే గతేడాదిలో పర్యాటకులు ఎక్కువగా సిమ్లా.. మనాలిలో పయనించారు. ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఓవైపు ఫాస్ట్ కల్చర్ కు అలవాటు పడుతూనే మరోవైపు ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతున్నారనే విషయం వెల్లడైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.