Begin typing your search above and press return to search.
పీకల్లోతు అప్పుల్లో ఆ దేశం.. తిండి కూడా కష్టమే!
By: Tupaki Desk | 4 Jan 2022 10:38 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగా ఉన్న దేశాలైతే చిగురుటాకులా వణికిపోతున్నాయి. అగ్రరాజ్యం, చిన్న దేశం తేడా లేకుండా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతోమంది పేదరికలంలో కూరుకుపోతున్నారు. ఇక శ్రీలంక దేశంలో పరిస్థితులు చాలా దిగజారాయి. ఆ దేశంలో ఆర్థిక-ఆరోగ్య సంక్షోభంలో పడ్డాయి. అన్ని రంగాలు కూడా అప్పుల్లోకి కూరుకుపోయాయి. ప్రస్తుతం దివాళా తేసే స్థితిలో ఉందని జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. అయితే వీటన్నింటికి కారణం కొవిడ్ అంటున్నారు. వైరస్ ప్రభావం వల్లే... శ్రీలంక నిండా మునిగిందని చెబుతున్నారు.
శ్రీలంకలో పర్యాటకం బాగా వృద్ధి చెందింది. ఆ దేశంలో ఎక్కువమంది కూడా టూరిజం డిపార్టుమెంట్ లోనే పని చేస్తారు. ఆ పర్యాటక రంగం ఎంతోమంది పొట్టనింపేది. కానీ మహమ్మారి పుణ్యమా... అని పర్యాటకం అంతా నిలిచిపోయింది. ఇంకేం వాళ్ల బతుకులు రోడ్డున పడ్డాయి. ఇకపోతే మిగతా ఉత్పత్తి, సేవలు, వ్యవసాయం వంటి రంగాల్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. అనారోగ్యం బారిన పడ్డారు. తినడానికి తిండి లేని పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర ధరలు మరింతగా పెరిగాయి. ఓవైపు చేతిలో పైసా లేదు.. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. దేశం నుంచి వెళ్లిపోవాలని చాలామంది ఆలోచిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. నిత్యావసర ధరల నివారణకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని ఆదేశించింది.
కరోనా వల్ల దవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. దాదాపు ఐదు లక్షల మంది పేదరికంలో కూరుకుపోయారని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ ప్రభావం మరో ఐదేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. గతేడాదిలో నవంబర్ లో 11 ఉన్న ద్రవ్యోల్బనం... డిసెంబర్ నాటికి 12కు పైబడడం ఆందోళన కలిగించే విషయమే. ఇకపోతే దేశంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ ఏడాదిలో మొత్తం 7.37 బిలియన్ డాలర్ల అప్పులను కట్టాల్సి ఉంది. చైనా నుంచే 5 బిలియన్ డాలర్లను అప్పులు చేసింది. కరోనా సమయంలో అప్పులు తీసుకొని.. చైనాకు దశల వారీగా చెల్లిస్తోంది. ఇక ఆ దేశ విదేశీ కరెన్సీ నిల్వలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం 1.6 బిలియన్లు మాత్రమే ఉండడం గమనార్హం.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స సరైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలవంతంగా రైతులను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించదని ఆరోపిస్తున్నారు. కరోనా వేళ ఖజానా ఖాళీ అయిన సమయంలో ఇతర దేశాల నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసింది. ఈ విధంగా పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయింది. కాగా యువతకు ఉద్యోగాల మాట అటు ఉంచితే... తినడానికి కూడా పైసల్లేవు అని లబోదిబోమంటున్నారు. ఈ ఏడాదిని దివాళా సంవత్సరంగా మారబోతుందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.