Begin typing your search above and press return to search.
షాకింగ్: నాలుగేళ్లుగా బాత్రూంలో ఆ కుటుంబం
By: Tupaki Desk | 26 July 2020 3:50 AM GMTమీడియాను మించిపోతున్న సోషల్ మీడియా పుణ్యమా అని షాకింగ్ వాస్తవాలు చాలానే బయటకు వస్తున్నాయి. అయితే.. సోషల్ మీడియాతో బయటకొచ్చే అంశాల్లో నిజం ఎంతన్న సందేహం పలుమార్లు కలుగుతుంది. తాజాగా వెల్లడైన ఈ అంశం అలాంటిదే. విన్నంతనే ఎంతమాత్రం నమ్మబుద్ది కాని ఈ నిజం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సాధ్యమేనా? అన్న సందేహం కలగొచ్చు కానీ.. ఇది నిజంగా నిజం.
ఇంతకూ ఆ విషయం ఏమంటే.. ఒక బాత్రూంలో ఒక కుటుంబం బతుకుబండి లాగుతుందని.. అది కూడా ఒకటి.. రెండు రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లుగా వారి నివాసం అదేనని చెబుతున్నారు. బాత్రూంలో నివసిస్తున్న కుటుంబానికి సంబంధించిన అంశం బయటకు రావటంతో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్ని పలువురు తప్పు పడుతున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని టీకామ్ గఢ్ జిల్లాలోని మోహన్ ఘఢ్ ప్రాంతం పరిధిలోని కేశవ్ ఘఢ్ గ్రా పంచాయితీలో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఆరుగురితో కూడిన ఒక కుటుంబం నాలుగేళ్లుగా బాత్రూంలో నివాసం ఉంటున్న విషయం బయటకొచ్చింది. మగన్ లాల్ అహీర్ వార్ ఫ్యామిలీ కేశవ్ గఢ్ గ్రామంలో నివాసం ఉంటుంది. కుటుంబ పెద్ద.. భార్యతో సహా నలుగురు పిల్లలు బాత్రూంలో ఉండేవారు. తమ కుటుంబానికి ప్రధానమంత్రి అవాస్ యోజన కింద ఇల్లు రాలేదన్నారు. తాము పలుమార్లు అధికారుల్ని సంప్రదించిన తర్వాత కూడా తమకు ఇల్లు కేటాయించలేదన్నారు. బాత్రూంలో నివాసం ఉండే ఈ కుటుంబానికి విద్యుత్.. గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. బాత్రూంలో నివాసం ఉంటూ కుమార్తె పెళ్లి చేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయం బయటకు వచ్చి రాజకీయ రగడకు తెర తీసింది.
ఈ విషయం పెను సంచలనంగా మారటంతో మీడియా రంగప్రవేశం చేసింది. దీనిపై ఒక జాతీయ మీడియా సంస్థ ఈ విషయం మీద స్థానిక రెవెన్యూ అధికారుల్ని సంప్రదించింది. దీనిపై స్థానిక తహసీల్దార్ అభిజీత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఉదంతం గురించి తనకు ఈ మధ్యనే తెలిసిందన్నారు. ఈ కుటుంబానికి వారి పూర్వీకుల గ్రామమైన అహీర్ వార్ లో ఇల్లు ఉందని.. వారు బాత్రూంలో నివసించిన విషయం తెలీదన్నారు.