Begin typing your search above and press return to search.
లీటర్ గో మూత్రాన్ని రూ.4 కొననున్న ఆ రాష్ట్ర సర్కార్
By: Tupaki Desk | 19 July 2022 4:08 AM GMTసరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సర్కార్. పశువుల పెంపకందారుల ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా.. ఆర్గానిక్ రైతులు లబ్థి చెందేలా తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది.
గడిచిన రెండేళ్లుగా ఆవుపేడను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గోమూత్రాన్ని లీటర్ల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఈ నెల 28న రాష్ట్ర ప్రజలు నిర్వహించే హరేలీ పండుగ సందర్భంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
లీటరు గో మూత్రాన్ని రూ.4 చొప్పున ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇలా కొనుగోలు చేసిన గోమూత్రాన్ని పురుగులు.. చెద నివారణ కోసం వినియోగిస్తారని చెబుతున్నారు.
ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆవు పేడను గోధన్ న్యాయ్ యోజన కింద కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆర్గానిక్ పంటల్ని పండించే రైతులకు ఇస్తున్నారు. దీనితో.. ఎరువులు.. పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడేలా రైతుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
గోమూత్రం కొనుగోలును రాష్ట్రం మొత్తం కాకుండా ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలోని రెండు ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు చేస్తారు. పశు పెంపకం దారుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఈ పథకాన్ని మరింతగా విస్తరించనున్నారు.
గోమూత్రాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్లు చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్గానిక్ పంటల్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన వైనం మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తివంతమని చెప్పక తప్పదు.