Begin typing your search above and press return to search.
ఢిల్లీకి వెళ్లాలంటేనే ఆ గవర్నర్ కు భయమేస్తుందట
By: Tupaki Desk | 12 Dec 2019 5:00 AM GMTమీరు చదివిన దాన్లో ఎలాంటి తప్పుల్లేవు. నిజమే.. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే భయంగా ఉందంటూ ఒక రాష్ట్ర గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వాస్తవానికి గవర్నర్ వారి బిగ్ బాస్ ఉండేది ఢిల్లీలోనే. మరి.. అలాంటివేళ.. ఢిల్లీ టూర్ మీద ఆయన ఎందుకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న విషయంలోకి వెళితే ఆసక్తికర విషయం బయటకు వస్తుంది.
ఇంతకీ ఢిల్లీకి వెళ్లాలంటే భయంగా ఉందన్న ఆ గవర్నర్ ఎవరో కాదు ఒకప్పటి బీజేపీ సీనియర్ నేత.. కొంతకాలంగా ఏపీ గవర్నర్ గా వ్యవహరిస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్. అదేంది? ఆయనకు ఢిల్లీ ఏమీ కొత్త కాదు కదా? ఎందుకంతే ఆందోళన అంటే? ఆయన చెప్పేదేమంటే.. ఇటీవల కాలంలో ఢిల్లీ మహానగరంలో పెరిగిపోతున్న కాలుష్యంగా చెబుతారు.
గడిచిన రెండు మూడు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న వాతావరణ కాలుష్యం కారణంగా చోటు చేసుకున్న ఇబ్బందులు అందరికి తెలిసినవేనని.. అందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనను చేశారు. గవర్నర్ స్థాయిలో ఉన్న వారంతా వీవీఐపీ ట్రీట్ మెంట్ తో పాటు.. వారు బస చేసే ప్రదేశాలు అత్యంత నాణ్యతతో ఉంటాయి. అలాంటి సదుపాయాలు ఉన్నప్పటికీ ఢిల్లీకి వెళ్లాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్న గవర్నర్ గారి మాటలు వింటే.. అక్కడే బతికే సామాన్యుల సంగతేమిటో? అన్న ఆలోచన రావటం ఖాయం.